KGF: “కేజిఎఫ్” సినిమా ఇండియా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో యాష్ ని అద్భుత రీతిలో చూపించడం జరిగింది. ఓవరాల్ గా కన్నడ సినిమాలో రిలీజ్ అయిన కానీ అన్ని భాషల్లో వచ్చిన రెస్పాన్స్ ఓవర్ నైట్ లో ప్రశాంత్ నీల్ ని స్టార్ డైరెక్టర్ గా మార్చడం మాత్రమే కాక యాష్ కి ఇండియా వైడ్ గా మంచి మార్కెట్ క్రియేట్ చేసింది “కేజిఎఫ్”.
అయితే ఈ సినిమా తర్వాత “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాక ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం వస్తున్న “సలార్” హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో అనేక వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే సినిమాలో భారీ ఫైట్ లో ప్రభాస్ షర్టు లేకుండా కనిపిస్తాడట.
ఇప్పటికే ఆ ఫైట్ కోసం ఫుల్ వర్క్ ఔట్ చేస్తున్నాడట. సినిమా మొత్తానికి ఇదే హైలెట్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఫైట్స్ ఓ రేంజ్ లో ఉండేటట్లు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన “కేజిఎఫ్” సినిమా కంటే ఈ సినిమా చిరస్థాయిగా గుర్తుండిపోయే రీతిలో .. “బాహుబలి” రికార్డులను తలదన్నే విధంగా ప్రశాంత్ నీల్ ప్రతి సీన్.. చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో మరో బాహుబలి లాగా “సలార్” గుర్తుండి పోతుందని ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదని ఇండస్ట్రీ వర్గాల టాక్.