29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

నా మాటలు గుర్తు పెట్టుకోండి, హిట్ 3 ని తదుపరి స్థాయికి తీసుకెళ్తా అది నా వాగ్దానం

Hit 3 Director on Nanis Arjun Sarkar
Share

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ చేసిన నాని అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అందరిలా ఓ కమర్షియల్ చట్రంలో ఇరుక్కోకుండా నటనకి స్కోప్ వున్న పాత్రలలో నటించి మెప్పించాడు. అందుకే ప్రేక్షకులు అతనిని నేచురల్ స్టార్ అనే బిరుదుతో కీర్తించారు. ఇకపోతే నటుడిగానే కాకుండా నాని నిర్మాణరంగంలో కూడా అడుగుపెట్టాడు. నాని ఈపాటికే ఓ మూడు నాలుగు సినిమాలు నిర్మాణం చేపట్టాడు.

అందులో హిట్ సిరీస్ ఒకటి. కొన్నాళ్ల క్రితం హిట్ 1 సినిమా రిలీజు కాగా అది సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా లాస్ట్ వీక్ హిట్ 2 సిినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్ గా అతిథి పాత్రలో నాని కనిపించి అభిమానులను థ్రిల్ చేసాడు. రూల్స్ ని పట్టించుకోని క్రూరమైన పోలీసు ఆఫీస‌ర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో నాని అదరగొట్టాడు. మూవీ క్లైమాక్స్ లో ఇచ్చిన హింట్స్ ప్రకారం ఈ క్యారెక్టర్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్న హిట్-3 మెయిన్ రోల్‌లో కొన‌సాగ‌నున్న‌ట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Hit 3 Director on Nani’s Arjun Sarkar
Hit 3 Director on Nani’s Arjun Sarkar

ఇకపోతే HIT-2 మూవీ రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్‌ని బ్రేక్ చేయడంతో చిత్ర యూనిట్ మంచి ఖుషీగా వున్నారు. ఇక తాజాగా నాని సోషల్ మీడియాలో తన అర్జున్ సర్కార్ లుక్‌ని రివీల్ చేశాడు. అంతేకాకుండా HIT 2ని సూపర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. దాంతో నాని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రం మూడో భాగాన్ని శైలేష్‌ కొలను డైరెక్ట్‌ చేయనున్నాడని వేరే చెప్పాల్సిన పనిలేదు.

నాని సొంత బేనర్ అయినటువంటి ‘‘వాల్‌పోస్టర్ సినిమా’’ ఈ మూవీని నిర్మిస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. కాగా నాని తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను ఫినిష్ చేసి వీలైనంత త్వరగా అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ పూర్తిచేసి ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే సరిగ్గా ఇదే సమయానికి రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఇకపోతే నాని ప్రస్తుతం దసరా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇక ఈ సినిమా 2023 వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం కలదు.

ఆ సంగతి పక్కన బెడితే, నాని ప్రస్తుతం హాలిడే ట్రిప్​ ప్లాన్ చేస్తున్నట్టు భోగట్టా. దాని కోసం యూరప్ ట్రిప్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడినుండి తిరిగి వచ్చిన తర్వాత దసరా పెండింగ్ షూట్‌ను పూర్తి చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక నాని పుట్టు పూర్వోత్తరాలు గురించి అందరికీ తెలిసినదే. బేసిగ్గా చల్లపల్లి (కృష్ణాజిల్లా)కి చెందిన కుటుంబం అయినప్పటికీ నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. నాని కళారంగం వైపు అడుగులు పెట్టాక శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా చేసిన అనుభవం కూడా వుంది. ఆ తరువాత ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించడం జరిగింది.

ఇక నాని సినిమా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ సినిమా జెర్సీ ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ప‌లు విభాగాల్లో నేష‌న‌ల్ అవార్డులు అందుకున్న సంగతి విదితమే. కాగా ఇదే టైటిల్ తో బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ హిందీ రీమేక్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.


Share

Related posts

తెలుగు, మ‌ల‌యాళంలో `కేరాఫ్ కంచ‌ర‌పాలెం`

Siva Prasad

Salman-Ram Charan: స‌ల్మాన్ ఖాన్ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌.. నెట్టింట్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న క్రేజీ న్యూస్‌!

kavya N

Eesha Rebba : ఈషా రెబ్బ ని ఈ డ్రెస్ లో చూస్తే ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద ఆఫర్స్ ఇవ్వడం గ్యారెంటీ..

bharani jella