ఎన్టీఆర్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” విడుదలయ్యే ఐదు నెలలు కావస్తున్నా గాని ఇంకా ఈ సినిమా విజయం యొక్క సౌండ్ ప్రపంచ స్థాయిలో భారీగానే వినిపిస్తుంది. ఈ సినిమాతో ఫస్ట్ టైం తారక్ మొదటి ఇండస్ట్రీ హిట్ అందుకోవడం జరిగింది. మరో హీరో చరణ్ మూడో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తారక్.. చరణ్ కలిసి నటించిన ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం తెలిసిందే. ఈ సినిమాతో తారక్, చరణ్ లకి మంచి పేరు రావడం జరిగింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఇద్దరు హీరోల నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పలు కామెంట్లు కూడా పెట్టడం జరిగింది.
ఏకంగా ఇటీవల ప్రపంచ ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఆస్కార్ రేసులో ఉత్తమ నటుడు జాబితాలో ఎన్టీఆర్ హాలీవుడ్ హీరోలతో పోటీ పడుతున్నట్లు అమెరికా వెరైటీ అనే మ్యాగజైన్ ఓ కథనం కూడా ఇటీవల ప్రచురించడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే మరో ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ గురించి వినిపిస్తుంది. అదేమిటంటే దుబాయ్ బెస్ట్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు తన ట్విట్టర్ అకౌంట్ లో ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్ట్ న్యూస్ రాసి కొచ్చారు. అదేమిటంటే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఓ యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్ హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళతో ఎన్టీఆర్ చేస్తున్నట్లు తెలిపారు.
స్టోరీ తారక్ కి బాగా నచ్చడంతో ఒప్పుకున్నట్లు పేర్కొంటూ వెల్కమ్ టు హాలీవుడ్ అని ఎన్టీఆర్ గురించి పొగడ్తల వర్షం కురిపించారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఎన్టీఆర్ షెడ్యూల్ బట్టి చూస్తే ఇప్పుడప్పుడే వేరే సినిమా చేసే అవకాశం ఉందని ఇదంతా ఫేక్ అని కొంతమంది ఈ వార్త రియాక్ట్ అవుతున్నారు. మరి వాస్తవం ఏంటో కొన్ని రోజులు తెలిస్తే తెలుస్తుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే టాలీవుడ్ నుండి హాలీవుడ్ లోకి వెళ్లిన ఏకాక హీరోగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించినట్లు అవుతుంది.