RRR: ఏడాది ప్రారంభంలో “RRR” ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. “RRR” ఇప్పుడు థియేటర్ నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమా థియేటర్ నుండి వెళ్ళిపోయి మూడు నెలలు కావస్తున్నా గాని “RRR” క్రేజ్ ఇంకా తగ్గలేదు. సినిమా రిలీజ్ అయిన తొలినాళ్ళలో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు రాజమౌళి పనితనం పై.. తారక్, చరణ్ పెరఫార్మెన్స్ పై పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఒక్క మన దేశానికి చెందిన వాళ్లు మాత్రమే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు “RRR” చూసి తమదైన శైలిలో స్పందిస్తూ భారతీయ చలన చిత్ర రంగం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ సినిమాలు 21 జంప్ స్ట్రీట్, ది లెగో… తీసిన చిత్రాల దర్శకుడు, నిర్మాత క్రిస్టోఫర్ మిల్లర్ తాజాగా “RRR” చూసి సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు. “RRR” ఒక అత్యద్భుతమైన సినిమా. ఇది మైఖేల్ బే, బాజ్ లుహ్రమాన్ మరియు స్టీఫెన్ చౌ కలిసి సినిమా తీయడం లాంటిది.
ఇది 3 గంటల నిడివి ఉంది. కానీ.. 4 గంటలు ఉన్నా చూడొచ్చు. ఈ సినిమా చూస్తూ నేను ఎంతో ఎంజాయ్ చేశాను” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి సినిమా నిర్మాణ సంస్థ స్పందించి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఒక క్రిస్టోఫర్ మిల్లర్ మాత్రమే కాదు మార్వాడి చిత్రకారుడు అలిస్ ఎక్స్ జాంగ్, టీవీ మరియు సినీ రచయిత అమీ పాలెట్ హార్ట్మన్.. ఇలా చాలామంది హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు దర్శకులు “RRR” పై పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది. “RRR” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినిమాగా నిలిచింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!