Prabhas: ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఏదైనా వార్త వచ్చింది అంటే బీభత్సంగా ఇటీవల వైరల్ అవుతుంది. ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఉండటంతో.. బాహుబలి తో ప్రభాస్ రేంజే మారిపోవడంతో… సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రభాస్ మీద పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పెళ్లి గురించి రకరకాలుగా మొన్నటి దాక వార్తలు రాగా తాజాగా ప్రభాస్ భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి కొత్త కాంబినేషన్ లు అంటూ ఇష్టానుసారంగా వార్తలు రాస్తూ ఉన్నారు.
దీనిలో భాగంగా తాజాగా ఓ హాలీవుడ్ భారీ ఇంటర్నేషనల్ మూవీ లో ప్రభాస్ నటిస్తున్నట్లు ఓ వైరల్ న్యూస్ ఇటీవల తెగ హల్చల్ చేస్తుంది. మేటర్ లోకి వెళ్తే బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసే “మిషన్ ఇంపాజిబుల్” సిక్స్ సెవెన్ లో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అదంతా ఫేక్ న్యూస్ అని “మిషన్ ఇంపాజిబుల్” డైరెక్టర్ తేల్చి పారేశారు.
Read More: Prabhas: ఆ డైరెక్టర్ తో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్న ప్రభాస్..??
హాలీవుడ్ సంచలన హీరో టామ్ క్రూజ్ గతంలో “మిషన్ ఇంపాజిబుల్” 6 సిరీస్ చేయడం జరిగింది. ఏడవ సీరీస్ లో ప్రభాస్ తో పాటు ఆయన నటిస్తున్నట్లు… వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ప్రభాస్ చాలా టాలెంటెడ్ నటుడు అంటూ కూడా ఆ డైరెక్టర్ కితాబిచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం, సలార్, ఆది పురుష్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలే.