NTR: “RRR” సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేయడం తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ గెలవడంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయి మరింతగా పెరిగింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ భీమ్ పాత్రని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సినిమా ప్రేక్షకులు ఎంజాయ్ చేయటం జరిగింది. ఆయా దేశాలలో ఎన్టీఆర్ పాత్ర పై వారి పత్రికలలో రకరకాల కథనాలు ప్రచురించడం జరిగింది. “RRR” విడుదలైన తర్వాత చరణ్ పాత్ర చాలా హైలైట్ అయినట్లు ఫస్ట్ లో క్రియేట్ అయింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళి పై నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పాత్ర హైలెట్ అయింది. ముఖ్యంగా “కొమరం భీముడో” సాంగ్ లో ఎన్టీఆర్ హవా భావాలు అంతర్జాతీయ స్థాయిలో చాలామందినీ ఆకట్టుకున్నాయి. దీంతో తారక్ తో సినిమా చేయడానికి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అప్పట్లోనే రెడీ కావడం జరిగింది. కాగా తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు జేమ్స్ గన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. “RRR” లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. ఇందుకోసం ఎన్టీఆర్ కు తగిన పాత్రను… సిద్ధం చేస్తానని అన్నారు. కాగా జేమ్స్ గన్…”గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ”, “ది సూసైడ్ స్క్వాడ్” వంటి సినిమాలు తెరకెక్కించి గుర్తింపు పొందారు.
అటువంటి టాప్ మోస్ట్ దర్శకుడు జేమ్స్ గన్ ఇప్పుడు తారక్ కోసం సినిమా రెడీ చేస్తున్నట్లు… కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. “NTR 30” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. కొరటాల శివ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఇది కంప్లీట్ అయ్యాక…అంతా ఓకే అయితే హాలీవుడ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.