“RRR” సినిమా థియేటర్ నుండి ఓటీటి లోకి విడుదలైన తర్వాత సినిమాలో సన్నివేశాలకు సంబంధించి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ప్రారంభంలో ఇండియాలో “RRR” గురించి సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు భారీ ఎత్తున చర్చించుకున్నారు. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావటంతో అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో “RRR” సన్నివేశాలు గురించి చాలామంది దర్శకులు టెక్నీషియన్ లు రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ నటనకు చాలామంది ఇంప్రెస్ అయ్యారు.
మరి ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ పార్ట్ సీన్ పులి ఫైట్ గురించి హాలీవుడ్ ఇండస్ట్రీ కథల కథలుగా చర్చించుకుంటుంది. మరి ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఎన్టీఆర్ లారీతో వచ్చి జంతువులతో రెండు ప్రమిదల పట్టుకుని జంప్ చేసే సీన్ ఫైట్.. ఎక్స్ట్రాడినరీ అని విదేశీయులు తెగ చర్చించుకుంటున్నారట. ఇటువంటి షాట్ ఇప్పటివరకు చలనచిత్ర రంగంలో ఎవరు తీయని రీతిలో డైరెక్టర్ రాజమౌళి తీశారని.. తారక్ ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశం చూసి హాలీవుడ్ ఇండస్ట్రీ దద్దరిల్లిపోతుంది.
అదరగొట్టే మేకింగ్ తో పాటు.. సరైన టేకింగ్ తో జక్కన్న అద్భుతంగా తెరకెక్కించాడని… విదేశీయులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ యాక్షన్ సీన్ సోషల్ మీడియాలో షేర్ చేయగానే ఒక్కరోజులోనే 10 మిలియన్ వ్యూస్ సాధించటం సంచలనంగా మారింది. “RRR” చూసి చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీలు… టెక్నీషియన్ లు.. తారక్ మరియు చరణ్ లకి అవకాశం ఇచ్చే దిశగా ముందుకు వస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఓటీటిలో కూడా “RRR” రికార్డులు క్రియేట్ చేస్తూ చాలా మంది ప్రముఖుల ప్రశంసలను అందుకుంటుంది.