Vijay deverakonda : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో 2019 వ సంవత్సరం లో “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమాతో అదిరిపోయే మాస్ హిట్ అందుకని ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమాని పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్న.. పూరి ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నరు.
సినిమాలో బాక్సర్ గా మరియు మాఫియా డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్ని రంగంలోకి దింపడం జరిగింది పూరి జగన్నాథ్. మేటర్ లోకి వెళ్తే హాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలకు మరియు జాకీజాన్ సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన యాండీ ఈ సినిమాకి స్టంట్ మాస్టర్ గా పని చేయబోతున్నారు.
కీలక పోరాట సన్నివేశాలు, అదరగొట్టే విధంగా పూరి జగన్నాథ్ డిజైన్ చేసినట్లు .. దీంతో ఫైట్ లు కూడా హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ ప్రేక్షకులకు అందించటానికి సినిమా యూనిట్ డిసైడ్ అవ్వడం జరిగింది. గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో “లైగర్” సినిమా రిలీజ్ కానుంది.