ఉదయభాను అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికీ ఆమె పరిచయమే. ఒకప్పుడు బుల్లితెరను ఓ ఊపు ఊపేసింది. టీవీల్లో ఎక్కడ చూసినా ఆమె షోలే కనిపించేవి. తన అందాలు, గ్లామర్ తో బుల్లితెరకు కొత్త అందాలను తెచ్చింది. తన అందాలతో ఎంతోమంది యువకుల మనస్సులను గెలుచుకుంది. ఉదయభాను అంటేనే కుర్రాళ్లు చచ్చేంత స్టార్ డమ్ ఆమెకు వచ్చింది. అయితే పెళ్లి తర్వాత పిల్లల బాధ్యతలను చూసుకుంటూ షోలకు దూరంగా ఉంది. అడపాడదపా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది.
అయితే త్వరలో బుల్లితెరపై ఉతయభాను మళ్లీ కనిపించనుంది. బిగ్ బాస్-6 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే నిర్వాహకులు పనుల్లో నిమగ్నమయ్యారు. కంటెస్టెంట్ల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇందులో భాగంగా యూత్ లో బాగా క్రేజ్ ఉన్న ఉతయభానును బిగ్ బాస్-6లోకి తీసుకునేందుకు బిగ్ బాస్-6 నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో బిగ్ బాస్ నిర్వాహకులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్-6లోకి అడుగుపెట్టేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
యూత్ లో ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా బిగ్ బాస్ నిర్వాహకులు ఉదయభానుకు ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వని విధంగా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దికాలంగా బుల్లితెరకు దూరమైనా ఉదయభానుకు క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇప్పటికీ అదే వాయిస్ తో, తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. అడపాదడపా కొన్ని ఆడియో పంక్షన్స్ లో కనిపిస్తుంది.
చాలామంది యాంకర్లు వచ్చి గ్లామర్ షో చేసి యూత్ ను ఆకట్టుకున్నారు. రష్మి, అనసూయ లాంటి వాళ్లు తమ గ్లామర్ డోస్ తో బుల్లితెరపై మైమరిపించారు. ఇలా ఎంతమంది కొత్త యాంకర్లు వచ్చినా.. ఉదయభానుకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె క్రేజ్ అలాగే పదిలంగా ఉంది. దీంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి బుల్లితెరపై మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని ఉదయభాను భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.