సినిమా

Allu Arjun: బ‌న్నీ `పుష్ప‌రాజ్‌`గా ఎలా మారాడు..? ఈ వీడియోలో చూసేయండి!

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. టాలీవుడ్ న‌టుడు సునీల్‌, మాలీవుడ్ హీరో ఫహాద్‌ ఫాజిల్ విల‌న్లుగా న‌టించారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్‌` డిసెంబ‌ర్ 17న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది.

విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ క‌లెక్ష‌న్స్ ప‌రంగా దుమ్ముదులిపేసింది. ఇప్ప‌టికీ కొన్ని కొన్ని చోట్ల ఈ మూవీ సాలిడ్ కాలెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ.. క్రేజీ రికార్డుల‌ను సృష్టిస్తోంది. ఇక‌పోతే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో బ‌న్నీ పుష్ప‌రాజ్‌గా ఊర‌మాస్ గెట‌ప్‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.

పుష్ప‌రాజ్‌గా మేకోవ‌ర్ అవ్వ‌డానికి ఏకంగా రెండు గంట‌లు స‌మ‌యం ప‌ట్టేద‌ని, ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల దాకా మేక‌ప్ కోస‌మే స‌మ‌యం కేటాయించాల్సి వ‌చ్చేద‌ని బ‌న్నీ పుష్ప రిలీజ్‌కు ముందే ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. అయితే బ‌న్నీ పుష్ప‌రాజ్‌గా ఎలా మేకోవ‌ర్ అయ్యాడు అనేది తెలియ‌జేస్తూ చిత్ర టీమ్ తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ సింది.

`మీకు తెలిసిన ఫైర్.. మీకు తెలియని ట్రాన్స్ఫర్మేషన్` అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన ఈ వీడియోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రూరమైన పుష్పరాజ్ గా ఎలా మారాడు అన్న‌ది చూడొచ్చు.


Share

Related posts

Bandhavi Sridhar Latest Gallerys

Gallery Desk

Remya Nambeesan Latest Photos

Gallery Desk

తనకు పండంటి బిడ్డ కావాలంటూ సుధీర్ ని అడిగేసిన రష్మి..! శ్రీమంతం వేడుకలో అందరూ షాక్

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar