Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ తో విడాకులు తీసుకున్న అనంతరం పూణేలో పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇదే సమయంలో పిల్లల సంరక్షణ చేసుకుంటూ మరోపక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఉన్నారు. ఇంతకుముందు టెలివిజన్ రంగంలో పలుషోలలో కూడా రేణు దేశాయ్ రాణించటం జరిగింది. అయితే తాజాగా రవితేజ కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావులో ఒక కీలకమైన పాత్ర చేయడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రనికి సంబంధించి రేణు దేశాయ్.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకోవడం జరిగింది. “టైగర్ నాగేశ్వరరావు సినిమాలో లవణం కుటుంబానికి చెందిన పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర నన్ను ఎంతగానో ప్రభావితం చేసి నాలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. నాకు నటన అంటే చాలా ఇష్టం. నేను పూర్తిగా నటనకు దూరం కాలేదు. నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలో గుండెకు సంబంధించి సమస్య కూడా ఉంది. ప్రస్తుతం ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాను. అయితే ఎత్తైన చోట నడిస్తే వెంటనే ఆయాసం వస్తది. నాకు జెనెటిక్ సమస్య కూడా ఉంది. మా నాయనమ్మ ఇదే సమస్యతో 47 సంవత్సరాల వయసులో మరణించింది. నా తండ్రి కూడా ఇదే సమస్యతో మరణించారు. నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేను.
ఇప్పుడు మీతో మాట్లాడుతూ సడన్ గా ఇంటర్వ్యూలో మరణించవచ్చు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ నా బాధ అంతా నా పిల్లల గురించే ..అంటూ రేణు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రేణు ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ అభిమాని ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు అని కామెంట్ పెట్టడం జరిగింది. దీంతో సదరు నేటిజన్ పై రేణు సీరియస్ అయ్యారు. నేనేం మాట్లాడాలో చెప్పడానికి ఎవరు నీకు హక్కు ఇచ్చారు అని నిలదీశారు. నా మాజీ భర్త నా ఇద్దరు పిల్లలు గురించి మాట్లాడటం అనేది నా ఇష్టం. సోషల్ మీడియాలో మీరు ఏం మాట్లాడాలో మేము చెప్పడం లేదు. మీరు కూడా మాకు చెప్పొద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.