సినిమా

వామ్మో, త్రిష ఎన్నిసార్లు ప్రేమలో పడుతుంది..? ఈసారి కూడా ఫెయిలేనట..!

Share

 

అందాల భామ త్రిష తన ముచ్చటైన హావభావాలు, నటనతో ప్రేక్షకులందర్నీ కట్టిపడేస్తుంది. మోడలింగ్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించి మిస్ తమిళనాడు కిరీటాన్ని కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం చేస్తుంది. 2002లో ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష ఇప్పటికీ తన నటనతో దూసుకెళ్తోంది. దాదాపు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ బ్యూటీ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు స్టార్ హీరోస్ అందరితో జతకట్టింది. లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతా బాగానే ఉంది కానీ 40 సంవత్సరాలు వచ్చిన ఈ అమ్మడుకి పెళ్లి మీద మాత్రం ధ్యాస కలగడం లేదు. గతంలో పెళ్లి విషయంలో త్రిష ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉండేది.

త్రిష ఎన్నిసార్లు ప్రేమలో పడింది?

 

గతంలో ఒక టాలీవుడ్ హీరోతో ప్రేమ వ్యవహారం నడిపిందని, ఆ తర్వాత ఆ ప్రేమ ఫెయిల్ అయిందని టాక్. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తో కూడా ఈ ముద్దుగుమ్మ ప్రేమ వ్యవహారం నడిచిందని వార్తలు వచ్చాయి. వీరికి సంబంధించిన ఒక ముద్దు వీడియో కూడా బయటికి వచ్చి సంచలనం సృష్టించింది. హీరో విజయ్ తో కూడా ఈమె డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు 2013 కాలంలో వరుణ్ మాణియన్ అనే సినీ నిర్మాత, వ్యాపారవేత్తతో ఆమె నడిపిన ప్రేమాయణం నిశ్చితార్థం వరకు వచ్చింది. కానీ పెళ్లి పీటలు మాత్రం ఎక్కలేదు. దాంతో ప్రేమ, పెళ్లి అనే విషయాలను పక్కనపెట్టి పూర్తిగా త్రిష దృష్టి మొత్తం నటనపై ఉంచింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ ప్రేమ వ్యవహారాలతో ఆమె వార్తల్లోకెక్కింది.

మళ్ళీ ఫెయిల్ అయ్యిందా?

త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ‘వక్రబుద్ధి కలిగిన నీలాంటి వాడితో మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం’అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వాళ్లందరూ త్రిష అలా మాట్లాడడానికి కారణం ఏంటి? ఎవరిని ఉద్దేశించి అంత ద్వేషంగా మాట్లాడుతుంది? కొంపదీసి మూడోసారి కూడా ప్రేమలో ఫెయిల్ అయ్యిందా ఏంటి? అని ఎవరికి తోచినట్టు వాళ్లు నెటింట్లో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


Share

Related posts

KGF 2: 19 ఏళ్ల కుర్రాడు కి అవకాశం ఇచ్చినా “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్..!!

sekhar

Radheshyam: అదీ డార్లింగ్ స్టామినా..’రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందే నిర్మాతలకి భారీ లాభాలు..ఎంతంటే..?

GRK

Vaarasudu: ద‌ళ‌ప‌తి బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. `వారసుడు` నుంచి వ‌చ్చిన మ‌రో ట్రీట్‌!

kavya N