లేడీ సూపర్ స్టార్ నయనతార జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె ప్రియుడు, ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఆ సంబరాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నయనతార విగ్నేష్ శివన్ చాలా సంవత్సరాలుగా లవ్ చేసుకుంటూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు.
పెద్దల సమక్షంలో..
ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమ పక్షులు ఈ ఏడాది ఆరంభంలో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరు గత ఆరేళ్లుగా ప్రేమ లోకంలో విహరిస్తున్నారు. మొదట చాలా సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట తర్వాత మాత్రం ఓపెన్ అయ్యారు. మీడియాకు కనబడుతూ తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఈ జంట అన్యోన్యంగా ఉండడం చూసి అనేక మంది తమ విషెస్ చెబుతున్నారు.
హోరెత్తుతున్న సోషల్ మీడియా…
లేడీ సూపర్ స్టార్ బర్త్ డేను పురస్కరించుకుని ఆమె ఫ్యాన్స్ మరియు సినీ అభిమానులు నయన తారకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తమ అభిమాన హీరోయిన్ పదికాలాల పాటు చల్లగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. విగ్నేష్ శివన్ చేసిన సెలబ్రేషన్స్ తో నయనతార చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ చూడండి అంటూ ఈ బ్యూటీయే ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని షేర్ చేసుకుంది. నయనతార పలు చిత్రాల్లో నటించి విమర్శకులను కూడా మెప్పించింది. నయనతార ప్రస్తుతం రజనీకాంత్ తో చేసిన అన్నాత్తే సినిమా మంచి హిట్ గా నిలిచింది. దీంతో నయనతార ఫుల్ జోష్ లో ఉంది. తెలుగులో కూడా ఈ అమ్మడు అనేక మంది పెద్ద స్టార్లతో ఆడిపాడింది. ఇక ఈ బ్యూటీకి డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో అనేక మంది పెద్ద స్టార్ల సినిమాలను కూడా వదులుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. నయనతార సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!