వామ్మో.. హృతిక్ రోష‌న్.. కొత్త ఇల్లు అన్ని కోట్లా?

Share

“క‌హోనా ప్యార్ మై” సినిమాతో బాలీవుడ్ తెర‌కు ప‌రిచ‌య‌మై క్రిష్‌, ధూమ్, అగ్నిప‌థ్ వంటి చిత్రాల‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు హృతిక్ రోష‌న్‌. ఇప్ప‌టికే 6 ఫిలింఫేర్ అవార్డుల‌తో పాటు జాతీయ స్థాయిలో మ‌రిన్ని అవార్డులు అందుకున్నారు హృతిక్‌. బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోనే కాకుండా దేశంలోనే అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన న‌టుడుగా, మ‌గువ‌ల మ‌న‌సు దోచే అంద‌గాడిగా హృతికి పేరుతెచ్చుకున్నారు.

తాజాగా ఆయ‌న కొత్త ఇంటిని కొన్నార‌ని స‌మాచారం. అయితే, అందులో ప్ర‌త్యేక ఏంటీ అనుకుంటున్నారా? దాని ధ‌ర తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే ! అవును ఎందుకంటే దాదాపు రూ. 100 కోట్లు పెట్టి ఆ కొత్త ఇంటిని కొన్నారు. మీరు విన్న‌దే నిజ‌మే ! ముంబ‌యిలోని జుహు వెస్రోవా రోడ్డులోని ఓ భ‌వ‌నంలో రెండు అపార్టుమెంట్ల‌ను హృతిక్ కోనుగోలు చేశారు. అపార్టుమెంట్‌ డ్యూప్లెక్స్‌ పెంట్‌ హౌజ్‌ కాగా మరొకటి ఒకే అంతస్థు ఇల్లును మాన్షన్‌ ఇన్‌ ది ఎయిర్‌ కోసం అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మొత్తం 3800 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్నఈ అపార్టుమెంట్ ఖ‌రీదు రూ. 97.5 కోట్లు. అరేబియా స‌ముద్రం సీన‌రీతో అత్యంత అహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంతో కూడా చాలా అందంగా ఉంటుంద‌ట ఈ అపార్టుమెంట్‌. అందుకే ఇంత భారీ మొత్తంలో చెల్లించి దీనిని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రెండు అపార్టుమెంట్ల‌ను ఒక‌టి చేయ‌డానికి ఇంటిర‌య‌ర్ డిజైన్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం.

అయితే, దీనిని కొనుగోలు చేయ‌డానికి స్టాంప్ పేప‌ర్ల‌కే రూ.1.9 కోట్లు పెట్టార‌ట‌. దీని కోనుగోలుకు సంబంధించి ముందుగా రూ.67.0 కోట్లు చెల్లించార‌ట‌. ఇది ఆ భ‌వంతిలోని 15,16 అంత‌స్థుల‌తో క‌లిపి ఉన్న‌ట్టు తెలిపారు. మ‌రో ఫ్లాట్ 14 అంతస్తులో ఉంది. దీనిని రూ.30 కోట్లు పెట్టి కోనుగోలు చేశారు. గ‌త నెల‌లోనే ఈ డీల్ కుదిరిన‌ప్ప‌టికీ.. తాజాగా ఇది పూర్త‌యిన‌ట్టు హృతిక్ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.


Share

Related posts

Chammak Chandra: చమ్మక్ చంద్ర ఆస్తుల విలువ ఎంతో తెలుసా??

Naina

ఇండియ‌న్ క్రికెట‌ర్ హీరోగా… ‘ఫ్రెండ్ షిప్’  

anjaneyulu ram

RRR రిలీజ్ డేట్

Siva Prasad