బాలీవుడ్ స్టార్ హృతిక్ కొత్త చిత్రం `సూపర్ 30`. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గణిత మేధావి ఆనంద్‌కుమార్ బయోపిక్ ఇది. వికాస్ భల్ దర్శకుడు. ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది జూలై 26న విడుదల చేద్దామనుకున్నారు. తీరా అదే డేట్‌కు కంగనా తన సినిమా మెంటల్ హై క్యా? సినిమా ఉంటుందని ప్రకటించింది. ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో హృతిక్‌పై కామెంట్స్ చేసింది. హృతిక్ తన సినిమా `సూపర్ 30`ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఉన్నట్లుండి హృతిక్ తన సినిమాను జూలై 12న విడుదల చేయబోత్నట్లు ప్రకటించాడు. ఈద్ సందర్భంగా ట్రైలర్‌ను జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై కంగనా రనౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
previous post
next post