శంకర్ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్

Share

సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాడ్ చేస్తు టెక్నీకల్ పరంగాను హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తు సినిమాని తెరకెక్కిస్తాడు.. రోబో సినిమాతో ఇండియన్ టాప్ డైరెక్టర్ లిస్ట్‌లో చేరిపోయాడు శంకర్. ఇటీవ‌లే 2.0 విజువ‌ల్ వండ‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకోచ్చాడు. ఈ మూవీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తు బాక్సాఫీస్ పాత రికార్డులని చెరిపేసింది.అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే లోకనాయకుడు కమల్ హాసన్‌తో భారీతీయుడు 2 సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఈ నెల 18 నుంచి కేరళలోని పోల్లాంచిలో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతుంది.

భారతీయుడు 2 త‌ర్వాత బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్‌తో మూవీ చేయబోతున్నాడట శంకర్.. 2.ఓ సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన పాత్ర కోసం ముందుగా హృతిక్ ను శంకర్ సంప్రదించాడట. అయితే అప్పుడు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో రోబో 2. ఓ సినిమా చేయలేక పోతున్నానని చెప్పిన హృతిక్ రోషన్ మరో ప్రాజెక్టు చేద్దామని అన్నాడట. ఇప్పుడు అదే కమిట్‌తో శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాక్స్ న‌డుస్తున్న‌ట్టు సమాచారం.

ఈ ప్రాజెక్ట్ సూప‌ర్ హీరో స‌బ్జెక్ట్‌ని బేస్ చేసుకొని , హృతిక్ రోష‌న్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ లైన్ వినిసించడట. కథ కనెక్ట్ అయిన హృతిక్ , శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బిటౌన్ వర్గాల సమాచారం.. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తుంది.. ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు చాలామంది ఆసక్తిని చూపుతున్నరట. ఇండియ‌న్ 2 మూవీ త‌ర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని తెలుస్తోంది. శంకర్ విజన్‌, హృతిక్ యాక్టింగ్ స్కిల్స్ తోడైతే ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలం సృష్టించ‌డం ఖాయ‌మంటున్నారు ఫ్యాన్స్.


Share

Related posts

నాగ శౌర్య సినిమాలో రకుల్ ప్రీత్ .. డామినేట్ చేస్తుందంటున్న ఫ్యాన్స్ ..?

GRK

Thaman : థమన్ దూకుడుకి దేవిశ్రీప్రసాద్ బ్రేక్ వేస్తాడా..?

GRK

Niharika : చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరు గుర్తుపట్టారా..! వైరల్ గా మారిన ఫోటో!

Teja

Leave a Comment