సినిమా

Pushpa 2: “పుష్ప 2” షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్..??

Share

Pushpa 2: భారతీయ చలన చిత్ర రంగంలోనే ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” ఊహించని సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమాలో బన్నీ పలికిన డైలాగులు.. వేసిన స్టెప్పులు దేశంలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. పుష్ప డైలాగులు… హావ భావాలు చాలా మంది అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు చెందిన సభ్యులు సోషల్ మీడియాలో గ్రౌండ్ లో కూడా ప్రదర్శించారు. సినిమా సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో వీడియోలు కూడా క్రియేట్ చేశారు. తగ్గేదేలే… శ్రీవల్లి సాంగ్ స్టెప్…లు వేసి వైరల్ అయ్యారు.

huge amounts being offered for pushpa 2 ott rights

డైరెక్టర్ సుకుమార్ కేవలం తెలుగు మార్కెట్ దృష్టిలో పెట్టుకుని సినిమా చేసి పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ చేసి… ఊహించని విజయం ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు. కనీసం బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప కి సంబంధించి ఒక్క ప్రమోషన్ కార్యక్రమం చేయకపోయినా.. అక్కడ వందకోట్లు కలెక్ట్ చేయడం అందరికీ మైండ్ పోయేటట్టు చేసింది. దీంతో ఇప్పుడు “పుష్ప2” కోసం యావత్ దేశం ఎదురు చూస్తూ ఉంది. అయితే పుష్ప మొదటి చాప్టర్ విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సెకండ్ పార్ట్.. చాలా భాషలలో ఇండియాలో ఏ సినిమా తెరకెక్కనీ రీతిలో చిత్రీకరిస్తున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ “పుష్ప” సక్సెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే “పుష్ప 2” షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినబడుతోంది. పూర్తి విషయంలోకి వెళితే “పుష్ప 2” అన్ని భాషల ఓటిటి డిజిటల్ రైట్స్ ఓ ప్రముఖ సంస్థ 300 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇప్పటికే డీల్ కుదిరినట్లు టాక్. ఈ వార్త ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.


Share

Related posts

Shriya: పాపం.. `ఆర్ఆర్ఆర్‌` వ‌ల్ల శ్రియా బాగా ఇబ్బంది ప‌డుతుందిగా!

kavya N

pooja Hedge Latest wallpapers

Gallery Desk

ఉగాది కానుక‌గా 

Siva Prasad