న్యూస్ సినిమా

పవన్ ఫ్యాన్స్ కోసం దిల్ రాజు భారీగానే చేంజ్ చేశాడే..!!

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ టీజర్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ఈ టీజర్ లో పవన్ నోట పలికిన మాస్ డైలాగ్ లు..యాక్షన్ సన్నివేశాలు అభిమానులలో ఎనర్జీ ని మరింత పై స్థాయికి తీసుకెళ్లాయి అని సోషల్ మీడియాలో టాక్. మామూలుగా హిందీలో అమితాబ్ నటించిన “పింక్” సినిమా పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనేసరికి అభిమానుల్లో నిరాశ కలిగింది.

Girls Missing in Vakeel Saab Teaser?ఎందుకంటే ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేషన్ పెద్దగా స్క్రీన్ మీద కనబడదు. అయితే ఇటువంటి తరుణంలో హిందీ తమిళ్ వెర్షన్ ల కంటే తెలుగులో పవర్ స్టార్ నటించిన పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ లో మాత్రం భారీ స్థాయిలోనే హై వోల్టేజ్ సీన్స్ పవన్ అభిమానుల కోసం దిల్ రాజు పట్టుబట్టి మరీ డైరెక్టర్ తో చర్చించి పెట్టినట్లు ఇండస్ట్రీ టాక్. దీంతో రిలీజ్ అయిన టీజర్ బట్టి చూస్తే  పవన్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని కథ కథనంలో కూడా చేంజెస్ చేసారని చెప్పవచ్చు. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా కనబడుతున్న నేపథ్యంలో.. అభిమానులు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు.

 

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లాయర్ పాత్రలో పవన్ మొట్టమొదటిసారి నటిస్తున్నారు. దాదాపు రెండు మూడు సంవత్సరాల గ్యాప్ ఇచ్చి ‘వకీల్ సాబ్’ తో ప్రేక్షకులను పలకరించడానికి పవన్ రెడీ అవటం తో బాక్సాఫీసు దగ్గర కూడా సందడి నెలకొంది. త్వరలోనే వేసవి సందర్భంగా సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో దిల్ రాజు వున్నట్లు సమాచారం.


Share

Related posts

3 Capitals : జగన్ కి స్వీట్ న్యూస్..!! ఈ దెబ్బతో కేంద్రం దిగొచ్చినట్టే..!

somaraju sharma

Liger: బాక్సర్ మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ..!!

sekhar

AP Ploitical Breaking: పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపీ తో అంటున్న చింతమనేని ప్రభాకర్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar