సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఇటీవల పుట్టినరోజు కావడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. మహేష్ బాబు ని మొదట వంశీ సినిమా చేయకముందే కలవటం జరిగిందని తెలిపింది. 2005 ఫిబ్రవరి 10 వ తారీఖున తమ వివాహం జరిగితే అంతకు ముందు నాలుగు సంవత్సరాలు ఇద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పుకొచ్చింది.
నాలుగు సంవత్సరాలు టైం పట్టడానికి కారణం..నేనే అతనికి సరైన భార్య అని ఒప్పించడం కోసమే అని తెలిపింది. జీవితంలో ఖచ్చితంగా నిలబడే వ్యక్తి మహేష్ బాబు అని, మహేష్ నా కళ్ళముందు రెండు రోజులు కనబడకపోతే చాలా మిస్ అవుతాను అని తెలిపింది.
ఇదిలా ఉంటే మహేష్ స్క్రిప్ట్ సెలక్ట్ విషయంలో తన ప్రమేయం ఉంటుందన్న వార్తలు అవాస్తవమని తెలిపింది. స్క్రిప్ట్ సెలెక్ట్ విషయంలో పూర్తిగా మహేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్ప వేరే వాళ్ల డెసిషన్ ఉండదని క్లారిటీ ఇచ్చింది. నా లైఫ్ మరియు నా డ్రీం మహేష్ అని చెప్పుకొచ్చింది.