జబర్దస్త్: అవినాష్ బిగ్ బాస్ కి వెళ్లింది అందుకా.. హైపర్ ఆది లీక్ చేసిన టాప్ సీక్రెట్!

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై మూడు వారలు పూర్తి చేసుకుంది. ప్రారంభంలో మంచి రేటింగ్ సొంతం చేసుకున్న ఈ బిగ్ బాస్ షో మధ్యలో కాస్త రేటింగ్స్ లో దారుణంగా పడిపోయింది. దీంతో బిగ్ బాస్ వారానికి ఒక వైల్డ్ కార్డును దింపుతున్నాడు. అలానే మొదటి వారం కుమార్ సాయి ని వైల్డ్ కార్డుగా దింపగా రెండో వారం జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు.

 

దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ముక్కు అవినాష్ ఏంటి బిగ్ బాస్ ఎంట్రీ ఏంటి అని .. ఇక ఈ విషయంపై నెట్టింట్లో పెద్ద చేర్చనే జరిగింది. కొందరైతే బిగ్ బాస్ షో లోకి వచ్చెనందుకు జబర్దస్త్ కు దాదాపు 10 లక్షలకు పైగా ఫైన్ కట్టాడు అని చెప్పారు. ఇక ముక్కు అవినాష్ బిగ్ బాస్ షోలో ఎంట్రీ విషయంపై హైపర్ అది ఓ టాప్ సీక్రెట్ ని బయటపెట్టాడు.

ఆ సీక్రెట్ ని కూడా హైపర్ అది స్కిట్ రూపంలోనే పంచ్ వేసుకుంటూనే చెప్పుకొచ్చాడు. అవినాష్ జబర్దస్త్ ను వదిలి పోవడానికి బలమైన కారణం ఉందట.. అవినాష్ ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. కరోనా లాక్ డౌన్ కు ముందు ఇల్లు కొన్నట్టు ఆ వెంటనే లాక్ డౌన్ వచ్చి షూటింగ్ లు ఆగిపోవడంతో కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని స్థితిలో ప్రస్తుతం అవినాష్ ఉన్నాడట. అందుకే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి ముక్కు అవినాష్ బిగ్ బాస్ షో కి వెళ్ళిపోయాడట.

ఇది డైరెక్టుగా చెప్పకపోయినప్పటికి హైపర్ అది తన స్కిట్ లోనే డైలాగులతో చెప్పసాడు అని సమాచారం. ఇక ఈ స్కిట్ చూసిన నెటిజన్లు కూడా నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన అవినాష్ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు.