Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ అమ్మాయి అయినా సాయి పల్లవి మలయాళంలో “ప్రేమం” సినిమాలో లెక్చరర్ గా హీరోయిన్ గా నటించి ఆడియన్స్ ని మొదటి సినిమాతోనే ఫిదా చేసింది. ఇక తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో..”ఫిదా” సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. టోటల్ గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొద్ది సినిమాలకే సాయి పల్లవి క్రేజ్ దక్కించుకుంది.
ముఖ్యంగా స్టెప్పులు వేసే విషయంలో సాయి పల్లవి నీ మించిన హీరోయిన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేదని చెప్పవచ్చు. స్టోరీ నేపథ్యం కలిగిన తన పాత్రకి మంచి డిమాండ్ ఉండే సినిమాలనే సాయి పల్లవి ఎంచుకుంటూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎక్కడా కూడా గ్లామర్ పాత్రలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ముందుగానే జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇదిలావుంటే ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో టాప్ నిర్మాణ ప్రొడక్షన్స్ గ్లామర్ పాత్ర కలిగిన రోల్ చేయాలని అని సాయి పల్లవి ని కోరాటం జరిగిందట.
అయితే సాయి పల్లవి ఎన్ని కోట్లు అయినా ఇవ్వండి.. నేను మాత్రం గ్లామర్ పాత్రలు అసలు ఏ మాత్రం చేయను… అంటూ మొహం మీదే సదరు నిర్మాణం ప్రొడక్షన్స్ కి చెందిన వాళ్లకి ఖరాఖండీగా చెప్పేసిందట. అయితే స్క్రిప్టులో ఎక్కువగా హీరోయిన్ కి డ్యాన్స్ ప్రాధాన్యం ఉండటంతో… సదరు సినిమా ప్రొడ్యూసర్ లు సాయి పల్లవి ఒప్పించే పనిలో ఉన్నట్లు ఆమె మాత్రం గ్లామర్ పాత్రలు నేను చేయనని చెబుతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినపడుతోంది. ప్రస్తుతం సాయి పల్లవి తమిళంతో పాటు మలయాళం అదే రీతిలో తెలుగులో భారీ ఎత్తున సినిమాలు చేస్తూ సౌతిండియాలోని బిజీ హీరోయిన్ గా కెరియర్ ని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తోంది.