సినిమా

Rakul Preeth Singh: ఓ నిర్మాతపై ఆధారపడి బతకాల్సిన ఖర్మ నాకు లేదు: రకుల్

Share

Rakul Preeth Singh: బేసిగ్గానే సెలబ్రిటీలు పైన మన మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల పర్సనల్ విషయాలంటే ఒకింత ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇక వారు డేటింగ్ చేస్తున్నా, రిలేషన్ షిప్‌ మెంటైన్ చేసినా ఇక అంతే సంగతులు. కెమెరాలు ఎప్పుడు వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇక వారు బయట కనిపిస్తే చాలు, అయిపోవాల్సిందే మరి. పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తుంటారు. చాలామంది తారలది ఇదే పరిస్థితి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌ కి ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇప్పుడు రకుల్ ఎక్కడ కనిపించినా పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు మరి.

I don't have the guts to depend on a producer: Rakul Preeth Singh
I don’t have the guts to depend on a producer: Rakul Preeth Singh

దీనికి కారణం ఇదే:

దీనికి కారణం ఆమె ఓ వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తుంది. టాలీవుడ్‌లో వరుసగా చిన్న, పెద్ద హీరోలందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బోర్ కొట్టి బాలీవుడ్ వైపు పయనించింది. అక్కడికి వెళ్ళాక అమ్మడు బాలీవుడ్ నిర్మాత అయినటువంటి ‘జాకీ భగ్నానీ’తో ప్రేమలో పడింది. ఈ విషయమై జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్ల క్రితమే అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది అమ్మడు. ఇక అప్పట్నుంచి మీడియా, అభిమానులు, నెటిజన్లు రకుల్ వెంట పడ్డారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతూనే ఉన్నారు.

I don't have the guts to depend on a producer: Rakul Preeth Singh
I don’t have the guts to depend on a producer: Rakul Preeth Singh

Rakul Preeth Singh: మీడియాపై విరుచుకుపడిన రకుల్?

అయితే మొదట్లో ఇలాంటి ప్రశ్నలు ఎదురైనపుడు “ఇప్పుడే చేసుకోము, చేసుకుంటే చెప్తాము” అంటూ కాస్త సౌమ్యంగా సమాధానాలిచ్చేది రకుల్, ఇపుడు మీడియాపై విరుచుకు పడుతోంది. ఎందుకంటే మనకు మన మీడియా వాళ్ళ అతి గురించి తెలుసు కదా. రకుల్ బయట కనిపించిన ప్రతిసారీ ఇదే ప్రశ్న వేయడంతో రకుల్ సహనం కోల్పోయింది. ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి ప్రశ్నించగా రకుల్ కొంచెం సీరియస్ గానే సమాధానమిచ్చింది రకుల్. “పెళ్లి అనేది చాలా సాధారణ విషయం. దయచేసి ఇలా ప్రతిసారి అడిగి విసిగించొద్దు. మా బంధం గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే నేనే స్వయంగా చెప్తాను.” అని కాస్త ఘాటుగా సమాధానం చెప్పింది.


Share

Related posts

U Turn : ‘యూటర్న్’ హిందీ రీమేక్..సమంత పాత్రలో ఆలయ

GRK

Anirudh : అనిరుధ్ కి అంత లేదు..లైట్ తీసుకోండి..!

GRK

#RC15: అఫిషియల్: రామ్ చరణ్ సినిమాకి తమన్ బాణీలు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar