బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హైదరాబాద్ తో తన జీవితానికి ముడిపడి ఉన్న అనుబంధం గురించి ఇటీవల ఓ మీడియా సమావేశంలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన తల్లి తరుపు కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాదులోనే ఉండేవాళ్ళు. అయితే మా అమ్మమ్మకి కొడుకులు ఎవరులేరు. సో మా అమ్మ నాకు జన్మ ఇచ్చాక.. మా సొంత అమ్మమ్మ నన్ను దత్తత తీసుకుంది. మా అమ్మమ్మ వాళ్లు హైదరాబాద్ లో తొలి చౌక్ లో ఉండేవాళ్లు. నా బాల్యంలో దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు తోలిచౌకిలోనే మా అమ్మమ్మ దగ్గర పెరగటం జరిగింది. నా తల్లి కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ తోలిచౌకిలోనే ఉన్నారు.
అయితే మా అమ్మమ్మ దగ్గర నుండి తర్వాత మా అమ్మ నన్ను బెంగళూరుకి తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ నుండి ఢిల్లీకి వెళ్లిపోయాము. కానీ హైదరాబాదులో షూటింగ్ లేదా క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన సమయం లో ఇక్కడ కుటుంబ సభ్యులనీ కలుస్తాను. నాకంటే నా పిల్లలకి హైదరాబాద్ తో బాగా అటాచ్మెంట్ ఉంది. ఖచ్చితంగా సెలవులు దొరికినప్పుడల్లా నా పిల్లలు ఇక్కడకు వచ్చి మా బంధువులతో కలిసి ఉంటారు. చిన్ననాటి టైములో ఇంకా యూత్ లో హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి చార్మినార్ వద్దకు వెళ్లి సమయం గడపటం నాకు చాలా ఇష్టం.
ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులు సైతం బిర్యానీ, హలీం కూడా బాగా చేస్తారు. రామోజీ ఫిలిం సిటీ లో ఏదైనా షూటింగ్ జరిగిన టైంలో.. మా బంధువుల దగ్గర నుండి హైదరాబాద్ బిర్యాని క్యారేజ్ వస్తది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్లు చాలా దయ దాక్షిణ్యం కలిగిన ప్రజలు. నాకు హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉంది అంటూ షారుక్ ఖాన్ ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.