SVP: సూపర్ స్టార్ మహేష్ నటించిన “సర్కార్ వారి పాట” మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో.. బాలీవుడ్ ఇండస్ట్రీ పై మహేష్ నెగిటివ్ కామెంట్లు చేసినట్లు ఇటీవల వార్తలు భారీగా వస్తున్నాయి. దీంతో వస్తున్న వార్తలపై మహేష్ స్పందించారు. బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎప్పుడూ కూడా నెగిటివ్ కామెంట్లు చేయలేదని స్పష్టం చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సౌకర్యంగా ఉంది అని చెప్పాను. అలాంటప్పుడు మన ఇండస్ట్రీ ని వదిలేసి.. అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్ అని మహేష్ చెప్పుకొచ్చాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో బాలీవుడ్ పై ఎప్పుడూ కూడా నెగటివ్ కామెంట్స్ చేయలేదు నేను అన్ని భాషలను గౌరవిస్తాను. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ కి రీచ్ అవ్వాలన్నదే నా కోరిక అని మహేష్ వివరణ ఇచ్చారు. ఇటీవల హిందీ భాష వర్సెస్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న తరహాలో కొన్ని వివాదాలు చెలరేగాయి. కిచ్చ సుదీప్.. అదే విధంగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ల మధ్యాహ్నం హిందీ భాష గురించి గొడవ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే అన్నట్టు ఇద్దరి మధ్య ట్వీట్ లు పడ్డాయి.
ఈ గొడవని బాలీవుడ్ మీడియా చాలా హైప్ చేసి చూపించింది. ఈ క్రమంలో మహేష్ కూడా ఆ తరహాలోనే కామెంట్లో చేసినట్లు బీ టౌన్ మీడియా వార్తలు వడ్డించింది. అయితే మహేష్ తాను ఎప్పుడూ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పై నెగిటివ్ కామెంట్లు చేసింది లేదని.. తాజాగా వివరణ ఇచ్చారు. అన్ని భాషలను గౌరవిస్తాను అని కూడా క్లారిటీ ఇచ్చారు.