24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: పాన్ వరల్డ్ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో బాలయ్య మూవీ..!!

Share

Balakrishna: నరసింహం నందమూరి బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల పరంగా తిరుగులేని డైలాగ్ డెలివరీతో పాటు మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన బాలయ్య వయసుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు సైతం ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. తన తోటి హీరోలు అడపాదడపా సినిమాలు చేస్తూ సీనియర్ హీరోలు అనే ముద్ర పడిపోయినా కానీ బాలకృష్ణ మాత్రం వయసుతో సంబంధం లేకుండా ఒక్కపక్క సినిమా రంగంలో మరోపక్క యాంకరింగ్ లో రాణిస్తున్నారు.

i will do pan world movie with balakrishna said producer c kalyan
Balakrishna

ఆహా ఓటీటీలో ఫస్ట్ టైం హోస్ట్ గా బాలయ్య రంగంలోకి దిగి ఊహించని రీతిలో “అన్ స్టాపబుల్” షోని మంచి ఎంటర్టైన్మెంట్ గా నడిపిస్తున్నారు.తనలో మరో కోణాన్ని చూపించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా “అన్ స్టాపబుల్” షో అనేక రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పాన్ వరల్డ్ తరహాలో సినిమా చేయడానికి బాలయ్య రెడీ కావడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత సీ.కళ్యాణ్… బాలకృష్ణతో ఇంటర్నేషనల్ రేంజ్ లో “రామానుజాచార్య” సినిమా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి సహకారంతో ఈ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.

i will do pan world movie with balakrishna said producer c kalyan
C Kalyan

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మల్లినేనితో “వీరసింహారెడ్డి” చేస్తున్నారు. ఇదే సమయంలో అనిల్ రావిపూడి సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. “వీరసింహారెడ్డి” జనవరి 12వ తారీకు విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు తర్వాత “రామానుజాచార్య” సినిమా ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బాలయ్య అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా చేయడానికి ముందుకు రావడం సంచలనంగా మారింది.


Share

Related posts

`మ‌న్మథుడు 2`కి గట్టిగానే ఇచ్చారు

Siva Prasad

Bheemla Naayak: “బీమ్లా నాయక్” థియేట్రికల్ ట్రైలర్ రన్ టైం వివరాలు..!!

sekhar

Rashmika: సెక్యూరిటీ గార్డ్ చేసిన ప‌నికి ర‌ష్మిక ఫైర్‌.. వీడియో వైర‌ల్‌!

kavya N