NTR: RRRతో అంతర్జాతీయ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ మంచి ఇమేజ్ సంపాదించుకోవడం జరిగింది. నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎన్టీఆర్ సొంతం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది. సింహాద్రి, యమదొంగ, జనతా గ్యారేజ్, RRR సినిమాలతో సత్తా చాటాడు. ఎవరితోనైనా కలిసి పోయే గుణం కలిగిన తారక్..కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ఇక పర్సనల్ లైఫ్ లో తారక్ కి సెంటిమెంట్స్ కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా తల్లి అంటే మహా ఇష్టం. ఆ తర్వాత భార్య ప్రణతి అంటే చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు.
పెళ్లయిన తర్వాత ప్రణతి తన జీవితంలోకి అడుగు పెట్టాక.. కెరియర్ పరంగా ఎన్టీఆర్.. మంచి స్పీడ్ అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించటం జరిగింది. అంతేకాదు ఇద్దరూ మగ పిల్లలతో మంచి ఫ్యామిలీ లైఫ్ సాగిస్తూ ఉన్నాడు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో ఒక తేదీ మాత్రం అతిపెద్ద సెంటిమెంట్ అట. ఆరోజునీ తన జన్మలో కూడా మర్చిపోను అంటూ చాలా ఇంటర్వ్యూలలో.. ఎన్టీఆర్ చెప్పుకు రావడం జరిగింది. ఆ తేదీ మరేదో కాదు మార్చ్ 26వ తారీకు. ఎందుకు ఆ తేదీ ఎన్టీఆర్ మర్చిపోలేడు అనేదానికి కారణం..చుస్తే 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తారక్ ప్రచారం చేయడం జరిగింది.
ఈ క్రమంలో శ్రీకాకుళంలో ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కార్ బోల్తా పడింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ చనిపోవాల్సింది. ఆ కార్ ప్రమాదంలో తారక్ తల, భుజం, మోచేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టం కొద్ది బయటపడ్డాడు. అయితే అదే తారీకు తన జీవితంలో భార్యగా వచ్చిన ప్రణతి పుట్టింది కూడా ఆరోజే. దీంతో ఎన్టీఆర్ మార్చ్ 26వ తారీకు..నాడు భార్య పుట్టినరోజు కేకుతో పాటు తనకు కూడా పునర్జన్మగా మరో కేక్ కట్ చేస్తూ ఉంటాడట. ఆ తేదీన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఎన్టీఆర్ చెప్పుకొస్తూ ఉంటాడు.