Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి వారసుడిగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. నటన పరంగా డాన్స్ పరంగా అన్ని రకాలుగా మెగా అభిమానులు కాలర్ ఎగరేసే రీతిలో మెప్పిస్తున్నాడు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. నటన పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా చరణ్ చాలా పద్ధతిగా ఉంటాడు అని చాలామంది చెబుతుంటారు. ఇదే సమయంలో ఫ్యామిలీకి చరణ్ చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఫ్యామిలీ విషయంలో బయట వాళ్ళు నోరు జారితే అదే రీతిలో చరణ్ కౌంటర్ ఇస్తాడు. ఇక రాజకీయంగా సీనియర్ హీరోయిన్ ఏపి మంత్రి రోజా మెగా ఫ్యామిలీ పై ఎప్పుడూ విరుచుకుపడుతూనే ఉంటారు అన్న సంగతి తెలిసిందే.
ప్రజెంట్ అధికారంలో ఉన్న అంతకుముందు లేకపోయినా గాని రాజకీయంగా రోజా మెగా ఫ్యామిలీ పై జనసేన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మంత్రి అయిన తర్వాత కొద్ది నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవి పై కూడా రోజా విమర్శలు చేయడం జరిగింది. ఆ సమయంలో చిరంజీవి ఏం మాట్లాడకపోయినా ఆయనను అంటే ఊరుకునే ప్రసక్తి లేదని “వాల్తేరు వీరయా” సినిమా సక్సెస్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే అంతకుముందు కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే అనే సినిమా చరణ్ చేయడం తెలిసిందే.
ఈ సినిమాలో జయసుధ పాత్రలో మొదటిగా రోజాని పెట్టుకోవాలని భావించారట. అయితే ఈ విషయం తెలిసిన చరణ్ అర్ధాంతరంగా సినిమా నుంచి తప్పుకుంటానని డైరెక్టర్ కృష్ణవంశీ మొహం మీద చెప్పాడు అంట. సడన్ గా ఏమైంది అని కృష్ణవంశీ ప్రశ్నించగా ఈ సినిమాలో రోజా కంటిన్యూ అయితే నటించిన అని మొహం మీద చెప్పేశాడట. దీంతో చేసేది ఏమీ లేక రోజా అని తప్పించేసి కృష్ణవంశీ జయసుధాని ఒప్పించి సినిమా చేయడం జరిగింది. గోవిందుడు అందరివాడేలే పెద్దగా ప్రేక్షకులను అల్లరించలేకపోయింది. కుటుంబ కథాచిత్రంగా వచ్చిన ఈ సినిమా.. మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.