F3: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు దేవి శ్రీ ప్రసాద్. దేవి సినిమా తో సంగీతదర్శకుడిగా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దేవిశ్రీప్రసాద్ తక్కువకాలంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు. ఈ మధ్యకాలంలో తప్ప అంతకు ముందు దేవిశ్రీప్రసాద్ చేతినిండా సినిమాలు ఉండేవి. కానీ సుకుమార్ దర్శకత్వంలో తాజాగా బన్నీ నటించిన “పుష్ప”తో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. ఇదిలావుంటే ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఎఫ్3” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దేవిశ్రీ పాల్గొనడం జరిగింది. ఈ సినిమా ఈ నెల 27వ తారీకు విడుదల అవుతున్న తరుణంలో… ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ఎఫ్3” సినిమా గురించి అనేక విషయాలు వెల్లడించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాను సినిమా ఒప్పుకునే ముందు ఆ సినిమాకి ఎటువంటి సంగీతం కావాలో… అన్నిటినీ తెలుసుకొని అప్పుడు సినిమాకి తనదైన శైలిలో సంగీతం ఇవ్వటం జరుగుతుందని దేవిశ్రీప్రసాద్ స్పష్టం చేశారు. జంధ్యాల, ఈవీవీ సినిమాల మాదిరిగా అనిల్ రావిపూడి పనితనం ఉంటుందని పేర్కొన్నారు. “ఎఫ్ 3” స్వచ్ఛమైన కామెడీ పండించే స్టోరీ అని స్పష్టం చేశారు. సినిమాలో ఏ పాట ప్రాధాన్యత ఆ పాటకు ఉందని.. విడుదలైన అన్ని పాటలకు మంచి స్పందన లభించింది అని దేవి శ్రీ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సినిమా విజయం సాధించాలని కోరుకుంటా. మా నాన్న తరచు ఒక మాట చెప్పే వాళ్ళు ఇతరులు విజయం సాధించినప్పుడు వారి విజయాన్ని అభినందించే వాడే గొప్పవాడు.
కనుక ఏ సినిమా విజయం సాధించిన తప్పకుండా తాను మాత్రం శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అని దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు. ఇక హైదరాబాద్ లో ఒక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఉచితంగా సంగీతం నేర్పించాలని ప్లాన్ చేస్తున్నాను. నా కల నెరవేరడానికి ఇంకా సమయం పడుతుంది అంటూ దేవి శ్రీ ప్రసాద్ కొత్త విషయాన్ని తెలియజేశారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!