Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో ఇండియా వైడ్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ రేంజ్ పెరిగిపోయింది. “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాతో దారుణమైన అట్టర్ ప్లాప్ అందుకున్న బన్నీ చాలా గ్యాప్ తీసుకోవటం తెలిసిందే. ఆ టైంలో అనేక స్క్రిప్టులు విన్న బన్నీ తనకి రెండు మర్చిపోలేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కథకి ఓకే చెప్పటం జరిగింది. అదే “అలా వైకుంఠపురంలో” సినిమా. ఈ సినిమాతో ఆల్ టైం రికార్డ్ బన్నీ అందుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమాతో ఎటువంటి విజయం అందుకున్నాడో తెలిసిందే.
పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప” దేశాన్ని ప్రపంచాన్ని షేక్ చేసి పడేసింది. “తగ్గేదేలే” అనే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో బన్నీ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలలో రోలెక్స్ తరహా పాత్రలో అల్లు అర్జున్ ని చూపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ తర్వాత నేరుగా బన్నీతో స్ట్రెయిట్ సినిమా చేయనున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం దళపతి విజయ్ తో లోకేష్ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తర్వాత… బన్నీ తో చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక బన్నీ…. సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ కానుంది. పుష్ప మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావటంతో దానికి మించి ఉండేలా సుకు స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. అంతేకాదు మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారట. పాన్ ఇండియా లెవెల్ లో క్రియేట్ అయిన మార్కెట్ ఆరీతిగానే ఉండేవిధంగా ఇతర ఇండస్ట్రీలకు చెందిన టాప్ మోస్ట్ దర్శకులతో బన్నీ పనిచేయాలని డిసైడ్ అయ్యి లోకేష్ కి ఓకే చెప్పినట్లు సమాచారం.