Jawan Review: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన “జవాన్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. తమిళ దర్శకుడా శ్రీ దర్శకత్వంలో ఈ సినిమా ఈనెల ఏడవ తారీఖు విడుదలయ్యి ఘన విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. విడుదలైన వారం రోజుల్లోనే 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీలో.. షారుక్ కెరియర్ లోనే అనేక రికార్డులు సృష్టిస్తూ ఉంది. “జవాన్” సినిమా విజయం సాధించటం పట్ల చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ బిగ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి సినీ ప్రముఖులే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర సైతం ఈ చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపించారు.
ఈ సినిమాలో షారుక్ నటనకు చాలామంది ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. ముందుగా ఇంత పెద్ద హిట్ సొంతం చేసుకున్నందుకు సినిమా యూనిట్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. “జవాన్” సినిమాలో ఫుల్లుగా షారుఖ్ నీ పూర్తి మాస్ అవతారణలో కనిపించడం జరిగింది. సినిమాలో షారుక్ స్వాగ్ చూసి ఫిదా అయినట్లు అల్లు అర్జున్ రాసుకురావడం జరిగింది. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటన చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దీపికా పదుకొనే, నయనతార నటన కూడా సినిమాకి చాలా ప్లస్ అయిందని పేర్కొన్నారు.
ముఖ్యంగా అనిరుద్ అందించిన సంగీతం చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇక మనందరం గర్వపడేలా ఆలోచింపచేసేలా కమర్షియల్ సినిమాని అందించిన.. డైరెక్టర్ అట్లీని అభినందించడం జరిగింది. అల్లు అర్జున్… షారుక్ “జవాన్” సినిమాపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తర్వాత డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో.. సినిమా చేయబోతున్న వార్తలు వస్తున్నాయి. పుష్ప తర్వాత సందీప్ రెడ్డితో తర్వాత అట్లీతో సినిమా చేయటానికి బన్నీ రెడీ అవుతున్నట్లు టాక్.