Entertainment News సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో హాలీవుడ్ డైరెక్టర్ భేటీ..??

Share

మెగా ఫ్యామిలీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీరే వేరు. చాలా వైవిధ్యంగా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటూ ప్రతి సినిమాకి మేకోవర్ చూపిస్తూ .. సరికొత్త పాత్రలతో అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉన్నారు. పుష్ప సినిమా రాకముందే దక్షిణాది సినిమా రంగంలో టాలీవుడ్ తో పాటు మలయాళం లో ఇంకా తమిళ రంగంలో భారీ ఎత్తున మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇక పోయిన సంవత్సరం పుష్ప రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

Icon star Allu Arjun met Hollywood director

చిన్నలు మొదలుకొని పెద్దల వరకు సెలబ్రిటీలు ఇంకా రాజకీయ నాయకులు వివిధ గేమ్స్ కి చెందిన స్టార్ ఆటగాళ్లు.. పుష్పలో బండి పలికిన డైలాగులు మరియు మేనరిజం లతో ఎంతగానో సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా అమెరికాలో బన్నీ పర్యటించడం తెలిసిందే. ఈ క్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఒకరు బన్నీతో సమావేశమయ్యారట.

Icon star Allu Arjun met Hollywood director

ఆ దర్శకుడు “పుష్ప” చూసిన తర్వాత ఎలాగైనా బన్నీ తో సినిమా చేయాలని.. డిసైడ్ అయ్యి ఏకంగా స్టోరీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగిందంట. దీంతో ఇటీవల బన్నీ న్యూయార్క్ పర్యటన చేపట్టిన సమయంలో… బన్నీతో ప్రత్యేకంగా కలసి తన సినిమా గురించి డిస్కషన్ చేసినట్లు వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. “పుష్ప” క్రేజ్ తో బన్నీ ఇంకా “RRR” క్రేజ్ తో చరణ్, ఎన్టీఆర్ లకి హాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. తారక్ మరియు చరణ్ లకి కూడా హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అనేక అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు సినిమా రంగం యొక్క స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది అని చెప్పవచ్చు.


Share

Related posts

రష్మిక కల ఎన్నాళ్ళకి నెరవేరబోతోంది .. ఇది కదా అసలు కావాల్సింది..!

GRK

Keerthy suresh: మెగా ఫ్యాన్స్‌కి చిరంజీవి కూడా చెప్ప‌లేనంత పెద్ద గుడ్‌న్యూస్ చెప్పిన కీర్తి సురేష్‌!

kavya N

ఇక‌పై నీ పేరు అదే..

Siva Prasad