Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. 2021 లో విడుదలైన “పుష్ప” బన్నీ తలరాతను ఒక్కసారిగా మార్చేసింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో బన్నీ పలికిన డైలాగులు..వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించాయి. ఫస్ట్ టైం సుకుమార్ మరియు బన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పుష్ప సినిమాని బరిలోకి దింపగా ఊహించని రేంజ్..లో సినిమా ప్రపంచాన్ని షేక్ చేసి పడేసింది. దీంతో ఇప్పుడు “పుష్ప 2” అదే రేంజిలో విజయం సాధించడానికి తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ నెలలో బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిన్నపాటి వీడియో మరియు డైలాగ్.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.
కాగా తాజాగా బన్నీ ఆహా లో “తెలుగు ఇండియన్ ఐడిల్ సీజన్ 2” ఫైనల్స్ కి గెస్ట్ గా వచ్చారు. దానికి సంబంధించిన ఎంట్రీ ఓ రేంజ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో శృతి అనే సింగర్ కూడా ఫైనల్ కి చేరుకుంది. అయితే ఆ అమ్మాయి పాట పాడగా అక్కడ ఉన్న వారంతా ప్రశంసించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ…”నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా అదే”… అంటూ సిగ్గుపడుతూ బన్నీ నవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే “పుష్ప 2” సినిమా కంప్లీట్ అయిన వెంటనే అల్లు అర్జున్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ మూడు సినిమాలు చేశారు. మూడో కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అయితే ఇప్పుడు మరో సినిమా కన్ఫర్మ్ అయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో బన్నీ సినిమా చేయాల్సి ఉంది. కానీ బోయపాటి బాలయ్య బాబుతో సినిమా ఒప్పుకోవటంతో ఈలోపు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.