Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా జ్యూరీ సభ్యులు అల్లు అర్జున్ నీ ప్రకటించడం తెలిసిందే. 2021 వ సంవత్సరానికి “పుష్ప” సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడి అవార్డు అల్లు అర్జున్ సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో ఫస్ట్ టైం భారతీయ చలనచిత్ర రంగంలో ఉత్తమ జాతీయ నటుడి అవార్డును సొంతం చేసుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు. దీంతో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖులు అభిమానులు ఇంకా రాజకీయ నేతలు అల్లు అర్జున్ ని అభినందిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం బన్నీకి ఉత్తమ జాతీయ నటుడి అవార్డు రావడం పట్ల సోషల్ మీడియా వేదికగా అభినందించడం జరిగింది.
ఈ క్రమంలో సీఎం జగన్ తనని అభినందించడం పట్ల.. అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. “థాంక్యూ సో మచ్ జగన్ గారు. మీ మెసేజ్ చూడటం చాలా ఆనందాన్ని కలిగించింది. హృదయపూర్వకంగా మీరు అభినందించినందుకు ధన్యవాదాలు” అని.. వైయస్ జగన్ పెట్టిన పోస్ట్ కి అల్లు అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ పోస్ట్ కి అల్లు అర్జున్ స్పందించిన తీరు ఏపీ రాజకీయాలలో తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనంగా మారింది. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” సినిమా బన్నీ కెరియర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ పలికిన డైలాగులు మరియు డాన్స్ ప్రాంతాలు భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ట్రెండ్ అయ్యింది. “పుష్ప” సినిమాలో బన్నీ మేనరిజమ్స్… స్టైల్ కూడా చాలామందిని ఆకట్టుకోవటం జరిగింది. విడుదలైన అన్ని భాషలలో “పుష్ప” భారీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి జాతీయ అవార్డు రావడంతో డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేశారు. సరిగ్గా జాతీయ అవార్డు ప్రకటించగానే అల్లు అర్జున్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. బన్నీని సుకుమార్ కౌగిలించుకుని ఏడ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.