SRK Bunny: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఇటీవల “పఠాన్” సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకోవటం తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్టు పడలేదు. ఈ క్రమంలో షారుక్ నటించిన “పఠాన్” తిరుగులేని విజయాన్ని సాధించింది. రికార్డు స్థాయి వసూలు రాబట్టి.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. కేవలం పది రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్లకు దగ్గరలో కలెక్షన్స్ సాధించింది. ఇంకా విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. భారతదేశంలోని అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా పటాన్ రికార్డు సృష్టించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం షారుక్ “జవాన్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా సరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది దీపావళి పండుగకు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో చాలామంది సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఎక్కువగా తమిళ రంగానికి చెందిన వాళ్లు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో షారుక్ జవాన్ సినిమాలో ఐకాన్ స్టార్ బన్నీ కూడా నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 2021 “పుష్ప” సినిమాతో దేశంలో ప్రపంచ స్థాయిలో బన్నీ మంచి పాపులారిటీ సంపాదించాడు. తగ్గేదేలా డైలాగ్ అందరి నోట్లో నాటుకుపోయింది. దీంతో దర్శకుడు అట్లే ఇటీవల బన్నీని సంప్రదించడం జరిగిందట… “జవాన్” సినిమాలో అతిథి పాత్రలో కనిపించాలని కోరారట.
దీనికి బన్నీ కూడా సానుకూలంగా స్పందించినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. పుష్ప మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సెకండ్ పార్ట్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ తో పాటు బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మొదటి భాగం ఎన్ని భాషలలో రిలీజ్ అయిందో దానికంటే మరిన్ని భాషల్లో “పుష్ప 2” విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో షారుక్ సినిమాలో బన్నీ నటిస్తున్నట్లు వార్త రావటం సంచలనం సృష్టించింది.