NTR: బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటే కచ్చితంగా ఆ సినిమా చేస్తా ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!!

Share

NTR: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” జనవరి 7వ తారీఖున భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం ఎన్టీఆర్(NTR) – రామ్ చరణ్(Ram Charan) వంటి పెద్ద హీరోలు కలిసి నటించడంతో … ఇండియన్ ఫిలిం లవర్స్ సినిమా ఎలా ఉంటుందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి(Bahubali) తర్వాత రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఈ సినిమా వస్తూ ఉండటంతో… ప్రపంచవ్యాప్తంగా “RRR” ఎలా ఉంటుందో అని అందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి.

Rajamouli: RRR Promotions .. Another Surprise With NTR Crazy Video

ఎక్కడా కూడా ఖాళీ లేకుండా చరణ్- ఎన్టీఆర్- రాజమౌళి హీరోయిన్ అలియా భట్ ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు. సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఇటీవల ముంబైలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయగా హిందీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి సల్మాన్ ఖాన్(Salman Khan) తో… రామ్ చరణ్, ఎన్టీఆర్ అదేవిధంగా రాజమౌళి సందడి చేశారు. ఇదే క్రమంలో మీడియా సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా హిందీలో ఎన్టీఆర్ అద్భుతంగా మాట్లాడుతూ నార్త్ ఇండియా రిపోర్టర్లకు తనదైన శైలిలో వాళ్లు వేసే ప్రశ్నలకు మంచి ఎనర్జిటిక్ ఆన్సర్ లు ఇచ్చాడు.

Jai Lava Kusa'

ఈ క్రమంలో మీరు నటించిన సినిమా హాల్లో ఏ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేసే అవకాశం వస్తే నేను సెలెక్ట్ చేసుకుంటారు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా 2017వ సంవత్సరంలో… వచ్చిన “జై లవకుశ” సినిమా ని రీమేక్ చేస్తానని.. తనదైన శైలిలో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని కళ్యాణ్ రామ్(Kalyan Ram) నిర్మించడం జరిగింది. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. సినిమా సూపర్డూపర్ హిట్ అయింది. దీంతో ఒకవేళ తన సినిమాల్లో ఏదైనా బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటే కచ్చితంగా “జై లవకుశ” సినిమా చేస్తానని ఎన్టీఆర్ సమాధానమిచ్చాడు. 


Share

Related posts

Allu arjun: ఒక్క భాష వదిలేస్తున్న అల్లు అర్జున్..ఇది మైనస్సేనా..?

GRK

Pushpa: “పుష్ప” సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం ఖర్చు చేస్తున్న బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

sekhar

Tollywood heroines: కెరీర్ క్లోజ్ అయ్యే సమయంలో ప్రయోగాలు చేస్తున్న హీరోయిన్స్..?

GRK