GodFather: దసరా పండుగకు విడుదలైన “గాడ్ ఫాదర్” సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమా యూనిట్ లో ఫుల్ జోష్ నెలకొంది. మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దూసుకుపోతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో చాలా సైలెంట్ పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవిని చూపించటంతో ఫ్యాన్స్ గాడ్ ఫాదర్ లో బ్రహ్మ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోవటంతో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ లు నిర్వహిస్తూ ఉంది. ఈ క్రమంలో దర్శకుడు మోహన్ రాజా ఇంకా విలన్ సత్యదేవ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా సినిమాలో యూట్యూబర్ జర్నలిస్ట్ పాత్ర చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంస్టాగ్రామ్ ఆన్ లైన్ లో పాల్గొని ఇద్దరు కూడా సినిమా గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్రను పవన్ కళ్యాణ్ చేసి ఉంటే మరో రకంగా ఉండేదని చిరంజీవి తెలిపారు. సల్మాన్ పాత్రకి పవన్ కళ్యాణ్ ని అడిగి ఉంటే కాదనే వాడు కాదేమో. కానీ సల్మాన్ చేస్తే ఇతర భాషల్లో కూడా న్యాయం చేసినట్లు ఉంటుందని ఆయనను తీసుకున్నట్లు.. చిరంజీవి స్పష్టం చేశారు.
మసూమ్ భాయ్ గా సల్మాన్ చేసిన పాత్ర సినిమాకి ఎంతగానో ఉపయోగపడింది. సినిమాలో కొద్దిసేపు ఉండగానే చాలా పవర్ ఫుల్ గా సల్మాన్ ఖాన్ నీ చూపించడం జరిగింది. నిజంగా ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ నీ ఒక డాన్ గా చూపించి ఉంటే అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని అభిమానులు కూడా అంటున్నారు. ఏది ఏమైనా గాడ్ ఫాదర్ విజయం పట్ల చిరంజీవి చాలా సంతోషం వ్యక్తం చేశారు పూరి ఇంటర్వ్యూలో.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!