Salaar: వరుసపరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్..”సలార్” పై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 28వ తారీకు సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు… రెండు భాగాలుగా తెరకెక్కించినట్లు అధికారిక పోస్టర్ కూడా కొద్దిరోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. దీంతో రెండు రోజుల్లో “సలార్” టీజర్ విడుదలవుతుందని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అభిమానులకు సాగిస్తూ “సలార్” సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించటం జరిగింది. సెప్టెంబర్ లో కాకుండా నవంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్స్ లో కూడా నవంబర్ నెలలో రిలీజ్ అని అప్ డేట్ చేయటం జరిగింది.
ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నిరోత్సాహం చెందుతూ ఉన్నారు. అయితే అసలు సినిమా చివరి నిమిషంలో ఆలస్యం కావడానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని వార్తలు వస్తున్నాయి. సినిమాకి సంబంధించి సీజీ వర్క్స్ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో.. సినిమాకి అదే మెయిన్ కావటంతో నవంబర్ కి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. “సలార్” సినిమాకి పనిచేస్తున్న సిజి వర్క్స్ సంస్థ గతంలో “రోబో2” సినిమా కి పని చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా రోబో 2 సినిమా గ్రాఫిక్స్ అనుకున్న సమయాన్ని కంటే లేట్ గా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆ కంపెనీని ఎంచుకోకుండా ప్రశాంత్ నీల్ వేరే ఆప్షన్ తీసుకుని ఉండి ఉంటే సినిమా వాయిదా పడేది కాదని తాజా వార్త పై సినీ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంలో ముందుగానే సరైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది కదా అని.. నిర్మాతలపై దర్శకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో “బాహుబలి” తర్వాత “సలార్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. కచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టామినా చూపిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే కేజిఎఫ్ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దానికంటే డబుల్ రేంజ్ లో ఈ సినిమా తీసినట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సిన “సలార్” వాయిదా పడటం అభిమానులకు ఎంతో నిరుత్సాహాన్ని కలిగించింది.