Samantha Naga Chaitanya: “ఖుషి” సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సమంత మరియు విజయ్ దేవరకొండ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత కొంతకాలంగా హిట్ అందుకొని ఇద్దరు ఈ సినిమాతో వచ్చిన విజయాన్ని బాగా ఆస్వాదిస్తూ ఉన్నారు. అయితే ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండతో సమంత వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మేటర్ లోకి వెళ్తే విజయ్ దేవరకొండ షర్టు విప్పేసి మరి సమంతనీ గాల్లోకి లేపి డాన్స్ చేయటం తర్వాత సమంత.. అర్ధరాత్రి వీడియో కాల్ చేయడం తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సమంత వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.
అయితే విడాకులు తీసుకున్నాక కూడా ఈ రకంగా నెగిటివ్ కామెంట్లు నాగచైతన్య ఫ్యాన్స్ నుండి రావటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో అసలు సమంతకి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నాగచైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో విడాకులు గురించి చైతన్య మాట్లాడుతూ…“మేము విడిపోయి రెండు సంవత్సరాలు అయ్యింది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది పూర్తయ్యింది. విడాకుల తర్వాత మా ఇద్దరి జీవితాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. ఇద్దరం వేరైనా ఆమెతో కలిసి ఉన్నని రోజులను చాల గౌరవంగానే చూస్తాను. నిజానికి సమంత లవ్లీ ఉమెన్. ఆమె అన్ని ఆనందాలకు అర్హురాలు. మీడియా ఊహాగానాల కారణంగానే మా మధ్య గొడవలు జరిగాయి. అవి పెద్దవయ్యాయి. చివరికి విడిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి నేను మొదట్లో ఊహాగానాల గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారాయి.
ప్రజలు ఇప్పటికీ నా పెళ్లి గురించి అనేక విషయాలు చర్చించుకుంటున్నారు. ఏదేదో ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. జీవితం చాలా బాగుంది. జీవితంలో ప్రతి అంశం నేర్చుకోదగినదే. నేను నా గతం, నా వర్తమానం, భవిష్యత్తును సానుకూలతతో చూస్తాను. ఏది జరిగినా నా మంచికే అనుకుంటాను” అని చెప్పుకొచ్చారు. కానీ ఆ టైములో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో మూడో వ్యక్తి గురించి మాట్లాడటం వల్లే.. సమంతతో విడిపోవలసి వచ్చింది అంటూ నాగచైతన్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో అసలు గొడవలకు సంబంధం లేని మూడో వ్యక్తి పేరు రావడం.. బాధ కలిగించిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందువల్లే సమంత తాను విడిపోయినట్లు స్పష్టం చేశారు.