KGF 2 RRR: “కేజిఎఫ్ 2” ఏప్రిల్ 14 వ తారీకు రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” మొదటి చాప్టర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో..”కేజిఎఫ్ 2″ పై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్…”కేజిఎఫ్ 2″ పై అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించిన విధానం సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. సినిమాలో కార్ చేజింగ్ సీన్, సంజయ్ దత్ ఎంట్రీ, పోలీస్ స్టేషన్ సీన్… అదేవిధంగా పార్లమెంట్ సన్నివేశం వర్షం లో ఫైట్.. క్లైమాక్స్ సన్నివేశాలు హై వోల్టేజ్ … ఎనర్జీతో తెరకెక్కించడంతో… థియేటర్ లో భారీ రెస్పాన్స్ వస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
డైరెక్షన్ పరంగా రాజమౌళికి డబల్ త్రిబుల్ తరహాలో ప్రశాంత్ నీల్ పనితనం ఉందని “కేజిఎఫ్ 2” చూసినవాళ్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం 100 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్… ఈ తరహాలో కలెక్షన్లు సాధించడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే “కేజిఎఫ్ 2” రాకముందు “ఆర్.ఆర్.ఆర్” మేనియా ఉండటం తెలిసిందే. బాహుబలి తరహాలో ఆర్ఆర్ఆర్ రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. పైగా ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు జరిగాయి. హిందీలో తమిళంలో మలయాళంలో కన్నడలో… రామ్ చరణ్, రాజమౌళి, తారక్ ప్రీ రిలీజ్ వేడుకలు జరిపారు. అంతే కాకుండా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. దీంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే “కేజిఎఫ్ 2” సినిమాకి వచ్చే సరికి ఎక్కడా కూడా పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు జరిపలేదు. అయినా గాని సినిమాకి వస్తున్న కలెక్షన్లు.. సంచలనాలు రేపుతున్నాయి. “ఆర్ఆర్ఆర్” మాదిరిగా “కేజిఎఫ్ 2” టీం ప్రమోషన్ కార్యక్రమాలు అన్ని చోట్ల చేసి ఉంటే మరో విధంగా.. కలెక్షన్లు వచ్చేవి అని …ఆర్ఆర్ఆర్… కలెక్షన్లని.. చాలా సులువుగా “కేజిఎఫ్ 2” దాటిపోయి ఉండేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. “కేజిఎఫ్ 2” టీం పెద్దగా ప్రమోషన్లపై దృష్టి పెట్టకపోవడం మైనస్ అయింది. “కేజిఎఫ్ 2” కి ప్రమోషన్ లు గట్టిగా చేసి ఉంటే కలెక్షన్ల ముఖచిత్రం మరో రకంగా ఉండేది అని.. చాలామంది కామెంట్ చేస్తున్నారు