బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తున్నారు. హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోయేలా సరికొత్త స్ట్రాటజీ తో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు రకరకాల టాస్క్ లు ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో హౌస్ లో ఉండే సభ్యులు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంటిలోవాతావరణం ఉంటున్న వీకెండ్ ఎపిసోడ్ ప్రోమోలలో డబల్ ఎలిమినేషన్ అంటూ చెబుతూ చివరికొచ్చేసరికి సింగల్ ఎలిమినేషన్ తో రెండుసార్లు చూస్తున్న వీక్షకులను మోసం చేయటం ఇప్పుడు షోపై నెగటివ్ ఇంప్రెషన్ తీసుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
రెండో వారంలో అదేవిధంగా నాలుగో వారంలో డబల్ ఎలిమినేషన్ అని ప్రేక్షకులలో ఆసక్తిని పెంచి చివరికొచ్చేసరికి సింగల్ ఎలిమినేషన్ చేయడం పట్ల చూస్తున్న వీక్షకులు సీరియస్ అవుతున్నారు. ఈసారి నాగార్జున డబల్ ఎలిమినేషన్ అని చెబితే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. హౌస్ లో జరిగే వాటిని ఎవరు ముందు ఊహించ కూడదు అనుకోవడంలో తప్పులేదు కానీ దానికి తగ్గట్టు వ్యవహరించాలి గాని ఎలా జనాలను మోసం చేయకూడదు అని వీకెండ్ ఎపిసోడ్ లపై జనాలు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
మరోపక్క ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న తరుణంలో టిఆర్పి రేటింగులు విషయంలో రాబోయే రోజుల్లో ఇలా చేస్తే బిగ్ బాస్ షో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని మరి కొంతమంది అంటున్నారు. ప్రస్తుత సీజన్లో ఒకపక్క ఐపీఎల్ కొనసాగుతున్న షో కి మంచి ఆదరణ వస్తున్న తరుణంలో చూసే ప్రేక్షకులు మైండ్ మోసం చేసే రీతిగా ప్రోమోలు లేకుండా ఉంటే బెటర్ అనే భావన బయట వినపడుతోంది.