NewsOrbit
Entertainment News సినిమా

Shaakuntalam: “శాకుంతలం”లో సమంత ధరించిన నగలు విలువ తెలిస్తే షాక్ అవాల్సిందే..!!

Share

Shaakuntalam: గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా “శాకుంతలం”. ఏప్రిల్ 14వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా డైరెక్టర్ గుణశేఖర్ తో పాటు సమంత మరి కొంతమంది సినిమాలో నటించిన వాళ్లు… ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సమంత… అనారోగ్యానికి గురి కావటం తెలిసిందే.

If you know the gold jewelery Samantha wore in Sakunthalam will be shocked

మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురై.. దాదాపు మూడు నెలల పాటు కంప్లీట్ తీసుకోవడం జరిగింది. వ్యాధి నయం కావడానికి సమంత తీసుకున్న చికిత్స ఆమె గ్లోతో పాటు శరీర ఆకృతిని పూర్తిగా మార్చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ తేరుకొని ఇప్పుడు వరుస పెట్టి ఒప్పుకున్న షూటింగ్లను కంప్లీట్ చేస్తూ ఉంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల ముంబైలో జరిగాయి. ఈ సందర్భంగా సమంత షూటింగ్ గురించి మాట్లాడుతూ… “శాకుంతలం” సినిమా చేస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేసినట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా సినిమాలో శకంతుల పాత్ర తనకి ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చింది. దీంతో సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన సాంగ్స్ మరియు ట్రైలర్… అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

If you know the gold jewelery Samantha wore in Sakunthalam will be shocked

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రతి ప్రేమ అద్భుతంగా ఉండేలా విజువల్ వండర్ వర్కింగ్ విషయంలో డైరెక్టర్ గుణశేఖర్ చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో సమంత లుక్ చాలా స్పెషల్ గా ఉండే విధంగా.. ముందు నుండి జాగ్రత్తలు తీసుకుని సుమారు 14 కోట్ల రూపాయల విలువచేసే నిజమైన బంగారు ఆభరణాలు ధరింపజేయడం జరిగిందట. ఈ ఆభరణాలు తయారు చేయడానికి సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించడం జరిగిందట. ఏప్రిల్ 14వ తారీకు “శాకుంతలం” పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు.


Share

Related posts

Raghava Lawrence: ముని సిరీస్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న రాఘవ లారెన్స్‌తో ప్రభాస్‌తో సినిమా తీసి నిర్మాతలను నష్టాలలో ఎందుకు పడేశాడు..!

GRK

రివ్యూ : సోలో బ్రతుకే సో బెటర్..!

siddhu

ఫ్యాన్స్ తో ‘విజయ్’ సెల్ఫీ.. సోషల్ మీడియాను ఊపేస్తోంది

Muraliak