మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడానికి నిర్మాతలు ఆయనకు రెమ్యునరేషన్ ఇస్తారు. మరి ఆ పాటలపై ఆయనకు అధికారం ఉండదా? అంటే ఉండదనే మ్యూజిక్ కంపెనీలు వాదిస్తున్నాయి. ఆయన సంగీతం అందించిన సినిమాల పాటలను ఆడియో కంపెనీలు కొన్ని ఉపయోగించుకుంటూ ఆయనకు ఎలాంటి రుసుమును చెల్లించడం లేదు. దీంతో ఇళయరాజా సదరు కంపెనీలపై 2014లో కేసు వేశారు. రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించి మద్రాస్ హైకోర్టు మరీ కేసును విచారణ చేయించింది. ఇళయరాజా సంగీతం అందించిన పాటలకు ఆయనే హక్కుదారుడని కోర్టు చెప్పింది. మరి నిర్మాతల నుండి ఆడియో కంపెనీ హక్కులను కొంటారు కదా!. అనే ప్రశ్నకు ఆడియో కంపెనీలు నిర్మాతల నుండి హక్కులను కొన్నారా? లేదా? అని తెలుసుకోవడానికి కోర్టు ప్రయత్నిస్తుంది. ఏదైతేనేం సంగీత దర్శకుల హక్కుల కోసం ఇళయరాజా చేసిన పోరాటం విజయవంతమైంది.
previous post
next post