థియేటర్ వ‌ద్ద అభిమానుల బీభ‌త్సం


సినిమా హీరో, హీరోయిన్స్ అంటే క్రేజ్ ఉండటం స‌హ‌జ‌మే. అయితే ఈ అభిమానం హ‌ద్దులు దాట‌కుండా ఉంటే బావుంటుంది. అభిమానం హ‌ద్దులు దాటితే అన‌ర్థాలే జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం హీరో విజ‌య్ విష‌యంలో అదే జ‌రిగింది. ఆయ‌న అభిమానులు ఓ థియేట‌ర్ వ‌ద్ద బీభ‌త్సం సృష్టించారు. వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కృష్ణ‌గిరి ఆవ‌ర‌ణ‌లోని దుకాణాల‌కు విజ‌య్ అభిమానులు నిప్పు పెట్టారు. శుక్ర‌వారం విజ‌య్ హీరోగా న‌టించిన `విజిల్‌` తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైంది. గురువారం సాయంత్రం ఈ సినిమాను స్పెష‌ల్ షోను ప్ర‌ద‌ర్శించ‌డానికి అనుమ‌తి ఆల‌స్యంగా వ‌చ్చింది. అయినా కూడా స్పెష‌ల్ వేయ‌క‌పోవ‌డంతో విజ‌య్ అభిమానులు దాడికి పాల్ప‌డ్డారు. ట్రాఫిక్ సిగ్న‌ల్స్‌తో పాటు పోలీస్‌, మున్సిప‌ల్ వాహ‌నాల‌ను కూడా ద్వంసం చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డి చేరుకుని లాఠీచార్జ్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దాడికి పాల్ప‌డిన 37 మందిని గుర్తించారు.