గోవా బ్యూటీ ఇలియానా లండన్‌కి చెందిన ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను కూడా ఇలియానా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసేది. `మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? మరి పెళ్లెప్పుడు?` అని ఎవరైనా అడిగితే.. `నేను పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని కలిపి చూడను. అయితే వ్యక్తిగతంగా నేను, అండ్రూ సంతోషంగా ఉన్నాం` అంటూ గడుసుగా బదులు చెప్పేది. అయితే మీడియా వర్గాల సమాచారం మేర ఇప్పుడు అండ్రూకి ఇలియానా బై బై చెప్పేసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఇలియానా తొలగించేసింది. అంతే కాదు, వారిద్దరూ ఒకరికొకరు అన్‌ఫ్రెండ్ అయ్యారు. వీటన్నిటినీ బట్టి చూస్తే వ్యవహారం చెడిందని ఇట్టే అర్థమైపోతుంది. మొన్నటికి మొన్న విశాల్ తో నిశ్చితార్థం చేసుకున్న అనీషా అల్లారెడ్డి కూడా ఇన్‌స్టాలో ఫొటోలను తొలగించింది. అంటే, తమ బ్రేకప్ విషయాన్ని జనాలకు ఈ రకంగా తెలియజేయడం ట్రెండ్ అన్నమాట.
previous post