Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన `దేవదాసు`తో సినీరంగ ప్రవేశం చేసిన ఇలియానా.. తొలి మూవీతో సూపర్ హిట్‌ను అందుకుని కావాల్సినంత క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ వెంటనే మహేశ్ బాబు సరసన ఈమె చేసిన `పోకిర` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ తన జీరో సైజ్ నడుముతో టాలీవుడ్‌ను కొన్నాళ్ల పాటు ఓ ఊపు ఊపేసింది. ఇక ఇక్కడ ఫామ్‌లో ఉండగానే ఇలియానా మనసు బాలీవుడ్ వైపు మల్లింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దాంతో తెలుగులో ఆఫర్ల వస్తున్నా.. వాటిని పక్కన పెట్టి హిందీ చిత్రాల్లో నటించడం స్టార్ట్ చేసింది. కానీ, ఆమె అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. మరోవైపు లండన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసి.. ఆపై అతడితో విడిపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రీల్ లైఫ్, రియల్ లైఫ్.. రెండిటిలోనూ సక్సెస్ అవ్వకపోవడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఇలియానా బరువు పెరగడం, ఆమె రూపు రేఖలు మారిపోవడంతో.. నెటిజన్లు రకరకాలు ట్రోల్స్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఎలాగోలా డిప్రెషన్ నుండి బయటపడిన ఇలియానా.. మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టి బరువు తగ్గింది. ప్రస్తుతం బాలీవుడ్లో అడపా తడపా అవకాశాలు అందుకున్న ఇలియానా.. తాజాగా సోషల్ మీడియా వేదికగా నయా లుక్స్‌తో నెటిజన్లు మిస్మరైజ్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఆమె లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాగా.. ఇలియానాను ఇలా చూసి ఎన్నేళ్లు అయింది, మునపటి కళ మళ్లీ ఆమె ముఖంలో కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews