`వెయిటింగ్ ఫర్ ది సన్ టు కమ్ ఔట్` అంటూ తెల్లటి బికినీలో హాట్‌గా ఫోజులిచ్చి ఫొటోలు పోస్ట్ చేసింది ఇలియానా. ఆమె మనసులో ఉన్న వెలుగులు సినిమా అవకాశాలేనని సినీ ప్రియులు భాష్యం చెబుతున్నారు. ఇటీవల ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో బ్రేకప్ అయిన తర్వాత ఇలియానా సినిమా అవకాశాల కోసం చాలా తాపత్రయపడుతున్నారు. కొత్తగా ఫొటో షూట్లు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా ఆమె కొరటాల శివ దర్శకత్వంలోచిరంజీవి పక్కన నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయం గురించి నెటిజన్లు ఇలియానాను ట్రోల్ చేశారు. ఆమె షేపులు ఇప్పుడు హీరోయిన్లతో పోటీపడటం లేదని పలువురు అన్నారు. సైడ్ ఆర్టిస్టుకైతే పనికొచ్చే స్థాయికి ఆమె చేరుకుందని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ఈ మాటలన్నీ విన్న ఇలియానా వెంటనే పాప్ సింగ్ డెమీ లావటో బికినీతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. `మీ బాడీని యాక్సెప్ట్ చేయండి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండండి` అని పోస్ట్ చేశారు. దీంతో ఆమె ట్రాలర్ల నోళ్లు మూయించినట్టయింది.