29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: అమెరికాలో RRR రీ రిలీజ్ లో కూడా సత్తా చాటింది..!!

Share

RRR: గత ఏడాది సరిగ్గా మార్చి నెల 24వ తారీఖు “RRR” విడుదలయ్యింది. “బాహుబలి” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన రాజమౌళి ఈ సినిమాకి దర్శకుడు కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అదిరిపోయే విజయం సాధించింది. ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి దర్శకుడు రాజమౌళి దర్శకత్వ దమ్ము మరోసారి “RRR” నిరూపించింది. అయితే ఈ సినిమా “బాహుబలి” కంటే.. కొన్ని వందల కోట్లు తక్కువ కలెక్ట్ చేసినా కానీ అంతర్జాతీయ స్థాయిలో మాత్రం అంతకుమించి రాజమౌళికి పేరు సంపాదించింది. భారతీయ చలనచిత్ర రంగంలో ఏ సినిమా అందుకొని అంతర్జాతీయ అవార్డులు “RRR” కీ రావటం జరిగింది.

In America, RRR also showed its ability in re-release

అంతేకాదు ప్రపంచ సినీ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ బరిలో కూడా ఉంది. ఇదిలా ఉంటే “RRR” ఇటీవల అమెరికాలో రీ రిలీజ్ కావడం జరిగింది. ఇటీవల వీకెండ్ విడుదలైన సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది. భారతీయ చలనచిత్ర రంగంలో అమెరికాలో రీ రిలీజ్ అయ్యి ఈ రకమైన కలెక్షన్స్ సాధించిన సినిమాగా “RRR” నిలిచింది. ఇదిలా ఉంటే మార్చి 13వ తారీకు… ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి వారం రోజుల కిందటే రాజమౌళి.. రామ్ చరణ్ తేజ్.. అమెరికాకి వెళ్లిపోవడం జరిగింది. ఈరోజే ఎన్టీఆర్ అమెరికాలో దిగారు.

In America, RRR also showed its ability in re-release

ఒరిజినల్ కేటగిరి సాంగ్ లో నాటు నాటు సాంగ్ ఆస్కార్ పోటీలో ఉంది. ఇదే కేటగిరీలో అంతకుముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో… కచ్చితంగా ఆస్కార్ కూడా వచ్చే అవకాశం ఉందని.. సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా “RRR”కి ఆస్కార్ వస్తే తెలుగు చలనచిత్ర రంగం స్థాయి మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమాలు అనేక రికార్డులు సృష్టిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ఆస్కార్ వస్తే మాత్రం టాలీవుడ్ కి తిరుగులేని క్రేజ్ ఏర్పడుతోంది.


Share

Related posts

లేటు వ‌య‌సులో ఘాటు అందాలు

Siva Prasad

వ‌ర్కింగ్ డేలోనూ వీక్ అవ్వ‌ని `బింబిసార‌`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

kavya N

షూటింగ్‌లో సందీప్ కిష‌న్‌కి గాయాలు

Siva Prasad