Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన “వీరసింహారెడ్డి” జనవరి 12వ తారీకు విడుదల కానున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ మొనగాడు టైటిల్ బాలయ్యకు ఉంది. ప్రతి సంక్రాంతి పండుగకు అప్పట్లో బాలయ్య విడుదల చేసే సినిమాలు సంచలన విజయాలు సాధించేవి. ఈ తరహాలో బాలయ్య కెరియర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ విజయాలు 1999లో “సమరసింహారెడ్డి” జనవరి 13వ తారీకు విడుదల కాగా… తర్వాత 2001వ సంవత్సరంలో “నరసింహనాయుడు” జనవరి 13వ తారీకు విడుదల అయ్యి ఇండస్ట్రీలో అతిపెద్ద విజయాలుగా కలెక్షన్స్ సాధించాయి.
ఈ క్రమంలో ఇప్పుడు ఇదే సెంటిమెంట్ “నరసింహనాయుడు” “సమరసింహారెడ్డి”కి అటు ఇటుగా “వీరసింహారెడ్డి” జనవరి 12వ తారీకు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు…తెలుస్తోంది. ఈ క్రమంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఫైట్స్ ఇంకా.. సాంగ్స్ చిత్రీకరణ సన్నివేశాలు మొత్తం కూడా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ తరహాలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం సినిమా రిలీజ్ తేదీ జనవరి 12వ తారీకని అధికారికంగా ప్రకటించటంతో అభిమానులు ఫుల్ సంతోషంగా ఉన్నారు.
సంక్రాంతి సీజన్ బాలయ్యకి మంచి కలిసొచ్చే సీజన్ కావటంతో పాటు “వీరసింహారెడ్డి” దర్శకుడు గోపీచంద్ మలినేని… సమరసింహారెడ్డి సినిమాకి ఇది 200 రెట్లు ఉంటుందని.. సినిమా టైటిల్ ప్రకటన కార్యక్రమంలో చెప్పటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. బాలయ్య చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు. సరిగ్గా సంక్రాంతి పండుగకు వస్తున్న ఈ సినిమా ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.