RRR: రాజమౌళి దెబ్బ కి దేశవిదేశాలలో రికార్డుల మోత మోగుతుంది. విషయంలోకి వెళ్తే జక్కన్న తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత “ఆర్ఆర్ఆర్” పై ఎక్కువ వర్క్ చేసిన రాజమౌళి.. దానికి తగ్గట్టుగానే రిజల్ట్ ఆడియన్స్ కి చూపించడంలో సక్సెస్ అయ్యాడు. “ఆర్ఆర్ఆర్” దియేటర్లలో సందడి చేస్తూ ఉంది. ప్రతి సన్నివేశానికి ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇద్దరు హీరోలు ఇంట్రడక్షన్ నుండి స్టార్ట్ అయిన రాజమౌళి బ్యాటింగ్ నాన్ స్టాప్ గా … ఫుల్ మీల్స్ చూసే ప్రేక్షకుడికి అందించేసాడు.
విడుదలైన ప్రతి చోట సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతున్న “ఆర్ఆర్ఆర్” హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే మరో ఐదు సంవత్సరాలు ఎవరూ అందుకోలేని స్థానాన్ని సెట్ చేసింది. అమెరికాలో ది మోస్ట్ ఆంటిసిపిటెడ్ పాన్ ఇండియా మూవీగా “ఆర్ఆర్ఆర్”… బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. అమెరికాలో “ఆర్ఆర్ఆర్” 1000 మల్టీప్లెక్స్ థియేటర్ లలో రిలీజ్ అవ్వడం మాత్రమే కాక అడ్వాన్స్ బుకింగ్ లోనే 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ప్రైవేట్ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చింది.
అమెరికాని కూడా తన అడ్డాగా “ఆర్ఆర్ఆర్” మార్చేసుకుంది. అమెరికాలో నెంబర్ వన్ ఫిలిం లిస్ట్ లో “ఆర్ఆర్ఆర్” ఉండటం విశేషం. సినిమా పాజిటివ్ టాక్ రావడంతో ఓవర్సీస్ లో కూడా సరికొత్త లెక్కలు ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” నమోదు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ లు రికార్డు స్థాయిలో సాధిస్తూ ఉండటంతో.. పైగా వీకెండ్ కావడంతో..”ఆర్ఆర్ఆర్” కొత్త రికార్డులు క్రియేట్ చేయటం పక్క అని ఫ్యాన్స్ కూడా ఫుల్ ధీమాగా ఉన్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!