RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” మార్చి 25 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నారు. వరుసపెట్టి ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. దేశ విదేశాలలో ఈ సినిమా రికార్డు స్థాయి స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం.. డైరెక్టర్ రాజమౌళి తో పాటు హీరోలు చరణ్, ఎన్టీఆర్ దేశంలో .. రిలీజ్ అవుతున్న అన్ని రాష్ట్రాలలో భారీ ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇటీవలే పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రాజమౌళి చరణ్ ఎన్టీఆర్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమా గురించి అనేక విశేషాలు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో యాంకర్ మీరు తీసిన సినిమాల్లో నచ్చని సినిమా ఏది అని ప్రశ్నించారు. దానికి రాజమౌళి సమాధానం ఇస్తూ… నా మొదటి సినిమా “స్టూడెంట్ నెంబర్ వన్”. దర్శకుడిగా స్టార్టింగ్ లో సినిమా చేయడంతో చాలా చిన్నతనంగా సినిమా తీసినట్లు.. అనిపిస్తోంది అని రాజమౌళి ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
దీంతో పక్కనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మొట్టమొదటి హిట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఏది ఏమైనా ఓవర్సీస్ ప్రేక్షకులకోసం.. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే విదేశాలలో “RRR” రికార్డు స్థాయి స్క్రీన్ లలో విడుదలవుతోంది. కొన్ని దేశాలలో ఇప్పటికే ప్రభుత్వాలు కూడా సినిమాకి బంపర్ ఆఫర్లు ప్రకటించడం జరిగినది. ఇక ఇదే సమయంలో విదేశాలలో ఉన్న చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు కూడా ప్రమోషన్ కార్యక్రమాలు తమదైన శైలిలో అభిమానం చాటుకుంటూ చేస్తూ ఉండటం విశేషం.